- District News
- చిట్యాల(చాకలి) ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
చిట్యాల(చాకలి) ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
నేటి తరానికి ఆదర్శ మూర్తి చిట్యాల (చాకలి) ఐలమ్మ .కట్టేబోయిన శ్రీనివాస్
*
లోకల్ గైడ్ సెప్టెంబర్ 10
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం కేంద్రంలో
తెలంగాణ వీరనారి, సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా సిపిఐ గార్ల మండల సమితి ఆధ్వర్యంలో గార్ల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కట్టేబోయిన శ్రీనివాస్ మాట్లాడుతు
చిట్యాల(చాకలి)ఐలమ్మ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచారని అన్నారు. భూస్వాముల దోపిడీ, వెట్టిచాకిరీ, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం తెలంగాణ ప్రజల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.
తనకు సాగు హక్కుగా ఉన్న భూమిని భూస్వాములు ఆక్రమించేందుకు ప్రయత్నించినప్పుడు ఐలమ్మ వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ఎదురొడ్డి నిలిచారని, తన భూమి కోసం మాత్రమే కాకుండా పేద రైతులు, కూలీలు, అణగారిన వర్గాల హక్కుల కోసం కూడా పోరాడారని తెలిపారు. ఆమె పోరాట స్ఫూర్తి తెలంగాణ సాయుధ రైతాంగ ఉద్యమానికి మరింత బలాన్ని ఇచ్చిందన్నారు.
“భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం” సాగిన మహత్తర పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్రను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళలు కూడా సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా ఉద్యమాల్లో ముందుండగలరని ఐలమ్మ తన పోరాటం ద్వారా నిరూపించారని పేర్కొన్నారు.
చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తూ భూమి, ఉపాధి, విద్య, వైద్యం, సామాజిక న్యాయం కోసం ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ గార్ల మండల కార్యదర్శి జంపాల వెంకన్న, సారిక శ్రీనివాస్, రాగం రమేష్, భూక్య హరినాయక్, మాజీ ఉపసర్పంచ్ లావుడ్య భీముడు,కట్టేబోయిన పిచ్చయ్య,బాదం రాజేష్, దొడ్ల రాంబాబు ఇల్టూరి శ్రీనివాస్,యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు
