అంగరంగ వైభవంగా శ్రీ అభయ మహా గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం 

Published On
అంగరంగ వైభవంగా శ్రీ అభయ మహా గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం 

గండిపేట్, ఆగస్టు 31 లోకల్ గైడ్:

శ్రీ అభయ మహా గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సోమవారం ఆల్ మార్క్బిల్డర్ ఆధ్వర్యంలో నిర్మితమైన ప్రతిష్టాత్మకంగా ఆల్ మార్క్ ట్రెజర్ అపార్ట్మెంట్ ప్రాంగణంలో శ్రీ అభయ మహా గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ఘనంగా నిర్వహించారు. భరద్వాజ ప్రవర్తక, శివాచార్య శిఖామణి, వేదాచార్య గురుకుల జ్ఞాన భాస్కర, వీర శైవ గురుకుల సంస్థాపకులు శ్రీ చంద్రశేఖర శివాచార్య మహా స్వాముల వారి దివ్య ఆశీస్సులతో ఈ ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది.  ఆల్ మార్క్ బిల్డర్స్ అధినేతలు శివ శంకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, జైపాల్ రెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి సాంప్రదాయ పద్ధతుల తో ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించి, మహాగణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.... ఈ పుణ్య కార్యం ద్వారా హాల్ మార్క్ ట్రెజర్ నివసించే ప్రతి కుటుంబానికి గ్రామ దేవతల ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని వారికి సుఖశాంతులు ఐశ్వర్యం విఘ్నాలు తొలగించి తొలగించి విజయాలను చేకూర్చాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంస్థ హెచ్ ఓ డీ లు ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి.
    నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.  జిల్లాలో నేర నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, ఎన్ బి డబ్ల్యు పెండింగ్ కేసుల పరిష్కారం, ఆస్తి
గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో ఘనంగా వినాయక చవితి ముందస్తు వేడుకలు
26వ రోజుకు చేరిన పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ ఉద్యమం
ఖరీఫ్ ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి – అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి
లోకపల్లిలో జనజాతర
పేదలపై నిర్లక్ష్యం.. హామీలు బేఖాతర్!
రోడ్డు మరమ్మత్తుల పనులను చేపట్టండి