ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డ్ అందజేస్తాం.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం: - ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 
Published On
ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

లోకల్ గైడ్/తాండూర్: 
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.సోమవారం పెద్దెముల్ మండలం కందనెల్లి జిపిఆర్ కార్డేన్లో లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ... గత పది సంవత్సరాలలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క పేద కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల లోనే పేదలకు అందరికీ రేషన్ కార్డులో అందజేశామన్నారు. అంతే కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు.గతంలో బీఆర్‌ఎస్‌ కూడా అనేక హామీలు ఇచ్చిందని, వాటి అమలుపై ప్రజలు నిలదీయాలని సూచించారు. మాటలు చెప్పడం సులభమని, ఆచరణలో చూపించడమే అసలైన పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.కాగా  కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు.
రైతుల సంక్షేమానికి రుణమాఫీ కింద సుమారు రూ.22 వేల కోట్ల మేర రుణాలను మాఫీ చేశామని, రైతు భరోసా ద్వారా రైతులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు.
పరీక్షల నిర్వహణలో పారదర్శకత
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అనేకసార్లు ప్రశ్నపత్రాల లీకేజీలతో నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయిందని ఆరోపించారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో డీఎస్సీ, టెట్‌తో పాటు వివిధ పోటీ పరీక్షలను సజావుగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
నిరుద్యోగ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు.అదేవిధంగా
ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, పాలు, రాగిజావ, పూరీ వంటి పోషకాహారాన్ని అందించడంతో పాటు దుస్తులు, స్పోర్ట్స్‌ కిట్లు, చదువుకు అవసరమైన వసతులను కల్పిస్తున్నామని చెప్పారు.
పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇన్ని రకాల అభివృధి చేస్తుంటే పని బాట లేని వారు బలుపు మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు ధారాసింగ్, తహసిల్దార్ వెంకటేష్ ప్రసాద్, మండల అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, రేషన్ కార్డు లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి.
    నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.  జిల్లాలో నేర నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, ఎన్ బి డబ్ల్యు పెండింగ్ కేసుల పరిష్కారం, ఆస్తి
గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో ఘనంగా వినాయక చవితి ముందస్తు వేడుకలు
26వ రోజుకు చేరిన పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ ఉద్యమం
ఖరీఫ్ ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి – అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి
లోకపల్లిలో జనజాతర
పేదలపై నిర్లక్ష్యం.. హామీలు బేఖాతర్!
రోడ్డు మరమ్మత్తుల పనులను చేపట్టండి