- District News
- భూ సేకరణ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలి...
భూ సేకరణ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలి...
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
నేషనల్ హైవే 63బాధిత రైతులంతా కలిసి బిజెపి ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాల ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.అనంతరం ఏఓ రమేష్ కు భూ సేకరణ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా బిజెపి నాయకులు తుల మధుసూదన్ రావు మాట్లాడుతు నేషనల్ హైవే 63రోడ్డు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్మూర్ నుండి మంచిర్యాల వరకు ప్రణాళికలు సిద్ధం చేయగా 2018లో గ్రీన్ ఫీల్డ్ హైవేగా సర్వే చేశారు.సర్వే రిపోర్ట్ ఆధారంగా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు,బడా పెట్టుబడిదారులు వారి ఆస్తులు భూములు కాపాడుకునేందుకు మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా చెప్పుకొని తిరిగే దళారి ద్వారా,సర్వే చేసిన అలైన్మెంట్ రోడ్డును సర్వే లోనే మూసి వేసారని ఆరోపించారు.తర్వాత కేంద్ర ప్రభుత్వం మరొక అలైన్మెంట్ కోరగా స్థానిక అధికారులు ఇప్పటికే అందుబాటులో ఉండి ప్రజలు ఉపయోగించుకుంటున్న మంచిర్యాల లక్షెటిపేట్ రాయపట్నం రోడ్డును అభివృద్ధి చేసినట్లయితే భూ సేకరణ కోసం ఏ విధమైన నిధులు వెచ్చించవలసిన అవసరం లేదని,ఎవరికి ఎలాంటి ఆస్తి నష్టం జరగడం లేదని,రోడ్డు సైతం సరళరేఖలో ఉందని,గోదావరి నదిపై ఇప్పటికే ఒక వంతెన నిర్మాణం చేసి ఉన్నందున నిర్మాణ వ్యయం కూడా తగ్గించుకోవచ్చని ఆలోచనతో ప్రభుత్వం బ్రౌన్ ఫీల్డ్ గా మార్చి 2023లో గెజిట్ పాస్ చేసిందని అన్నారు.ఈ విషయంలో కూడా రాజకీయ దళారి అవినీతిపరుడైన ఒక రాజకీయ నాయకుడు నాటి మాజీ పార్లమెంట్ సభ్యుడైన వివేక్ వెంకటస్వామితో చేతులు కలిపి లక్షేటిపేట ప్రాంతంలో గోదావరి నది వెంబడి భూములను కలిగి ఉన్న కార్పొరేట్ శక్తులకు గులాములుగా మారి వారి ఎంగిలిమితులకు ఆశపడి,ఢిల్లీలో ఉన్న మంత్రి,అధికారులను తప్పుదారి పట్టించి బ్రౌన్ ఫీల్డ్ ని గ్రీన్ ఫీల్డ్ గా మార్చి వందలాది మంది రైతుల భూములు కోల్పోయే విధంగా వీరి స్వార్థ ప్రయోజనాల కోసం రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.చివరికి కోర్టును ఆశ్రయించగా కోర్టు రైతుల పక్షాన నిలబడి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వగా నేషనల్ హైవే అధికారులు కూడా కార్పొరేట్ శక్తులకు తలొగ్గిన సందర్భంలో కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నారు.చివరికి రైతుల పక్షాన నిలబడ్డ న్యాయవాది కూడా కార్పొరేట్ శక్తుల కుట్రలో ఇరికి కేసును నిర్వీర్యం చేసే పరిస్థితికి తీసుకొచ్చిన సందర్భంలో కోర్టు రైతులకు 4వారాల గడువు సమయం ఇచ్చిందని,రైతులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పుపై స్టే విధించిందని,కోర్టు కేవలం స్టే విధించింది కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఎక్కడా కూడా ఆదేశాలు ఇవ్వలేదు,కానీ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కేసు వీగిపోయినట్లుగా కోర్టు ఆదేశాలు ఇచ్చినట్లుగా ఈ రోడ్డును వెంటనే పూర్తి చేయాలని ఆత్రుతతో రైతులు జీవితాలు ఏమైపోయినా తనకు సంబంధం లేదనే విధంగా వ్యవహరిస్తు నోటీసుల ప్రక్రియ వేగవంతం చేస్తు అవార్డులు అందజేయాలని ఆదేశాలు జారీ చేయడం బాహ్యమైన అవినీతి చర్య అని అన్నారు.2014లో ఇదే జిల్లా కలెక్టర్ రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది వారికి న్యాయం చేయండి బ్రౌన్ ఫీల్డ్ నే తిరిగి పునరుద్ధరించాలని,గ్రీన్ ఫీల్డ్ విరమించుకోవాలని చెప్పి ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపిన ఆయన ఈరోజు ఎవరికీ తలొగ్గి ఇంత వేగంగా నోటీసుల ప్రక్రియలో రెవెన్యూ శాఖను వేగవంతం చేయడం చూస్తుంటే ఆయన పని తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు.లక్షేపేటలోని కార్పొరేట్ శక్తులే కలెక్టర్ ను కూడా ప్రభావితం చేసాయెమోనని అనుమానం వ్యక్తం అవుతుందని పేర్కొన్నారు.గతంలో ఈ రోడ్డు నిర్మాణం వల్ల గ్రీన్ ఫీల్డ్,బ్రౌన్ ఫీల్డ్ తేడాలపై ప్రభుత్వానికి వచ్చే నష్టం రైతులకు జరుగుతున్న నష్టాలపై స్పష్టంగా రైతుల పక్షాన నిలబడ్డ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు,ప్రస్తుత చెన్నూరు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి వివేక్ రైతులకు మీ నియోజకవర్గంలో చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.వెంటనే మంచిర్యాల ఎమ్మెల్యే జోక్యం చేసుకొని రైతులకు అండగా నిలబడి ఇచ్చిన నోటీసులు ఉపసంహరించుకునే విధంగా కలెక్టర్ పై ఒత్తిడి తెచ్చి గ్రీన్ ఫీల్డ్ ని బ్రౌన్ ఫీల్డ్ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు,కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి,బ్రౌన్ ఫీల్డ్ గా నేషనల్ హైవే 63నిర్మాణం జరిగే విధంగా కృషి చేసి,కాంగ్రెస్ పార్టీ రైతుల క్షేమం కోరే పార్టీగా నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బాధిత రైతులు లగిశెట్టి రాజమౌళి,జనార్దన్ రెడ్డి,మల్లేష్,ఉస్మాన్ పాష,లింగయ్య,పోచమ్మ,చాంద్ మియా,సుశీల,నల్ల రమేష్,కొమ్ము సత్తయ్య,జి మహేష్,ఎం శ్రీనివాస్,దాస్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.
