- District News
- వనపర్తి పట్టణంలో విజృంభిస్తున్న డెంగ్యూ, మలేరియా ..
వనపర్తి పట్టణంలో విజృంభిస్తున్న డెంగ్యూ, మలేరియా ..
తక్షణమే అత్యవసర వైద్య పారిశుధ్య చర్యలు చేపట్టాలి..
తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాషా ..
Published On
By Ram Reddy
వనపర్తి లోకల్ గైడ్ ప్రతినిధి ఆగస్ట్ 8:
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి పట్టణంలోని మురుగుకాల్వల పూడికతీత సరిగ్గా జరగకపోవడం, నిలిచిన మురుగు నీటిలో దోమలు విపరీతంగా పెరిగిపోవడం వల్లే పట్టణంలో జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందన్నారు. నిరుపేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేసుకోలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ తీవ్రమైన పరిస్థితిపై వనపర్తి జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని కింద పేర్కొన్న అత్యవసర చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్, ఫాగింగ్ చర్యలు చేపట్టాలన్నారు . 33వ, 24 వ వార్డులలో పాటు పట్టణంలోని అన్ని 33 వార్డులలో రోజువారిగా ఫారింగ్ , నిల్వ నీటిలో యాంటీ లార్వా పిచికారి ముమ్మరంగా నిర్వహించాలన్నారు .
జ్వరాల ఉధృతి ఎక్కువగా ఉన్న వార్డుల్లో తక్షణమే ఉచిత హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయాలన్నారు. వనపర్తి జిల్లా ఆస్పత్రిలో డెంగ్యూ రోగుల కోసం ప్రత్యేక బెడ్లు, ప్లాట్ లెట్స్ తగినంత మందులు నిలువలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం , పురపాలక అధికారులు యుద్ధప్రతిపాదికన స్పందించాలని. బాధితులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా ఖాదర్ పాషా అధికారులకు.విజ్ఞప్తి చేశారు..
Tags:
About The Author
Related Posts
Latest News
22 Aug 2026 21:30:17
లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా
వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ ఏ డి ఏ ఎస్
