కొందుర్గు పీఏసీఎస్ డైరెక్టర్‌గా పద్మారం కావలి వెంకటేష్ నియామకం

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు కృతజ్ఞతలు

Published On
కొందుర్గు పీఏసీఎస్ డైరెక్టర్‌గా పద్మారం కావలి వెంకటేష్ నియామకం

 

      లోకల్ గైడ్ కొందుర్గు:

కొందుర్గు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) డైరెక్టర్‌గా పద్మారం కావలి వెంకటేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కావలి వెంకటేష్ మాట్లాడుతూ తనకు ఈ బాధ్యతను అప్పగించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, పీఏసీఎస్ చైర్మన్ జితేందర్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాకుండా ప్రజల్లో మమేకమై రైతులకు సేవ చేసే అవకాశం తనకు లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాను రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినని, రైతుల సమస్యలు, వారి కష్టాలు తనకు బాగా తెలుసని పేర్కొన్నారు.

రైతులకు కేవలం రుణాలు అందించడం మాత్రమే కాకుండా ప్రభుత్వం ద్వారా అందే అన్ని రకాల వ్యవసాయ సౌకర్యాలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన రైతులకు అందేలా కృషి చేస్తానని తెలిపారు. రైతుల పట్ల ఎలాంటి పక్షపాతం లేకుండా నిస్వార్థంగా సేవ చేస్తానని స్పష్టం చేశారు.

ప్రజలకు, రైతులకు సేవ చేసే అవకాశం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని కావలి వెంకటేష్ అన్నారు.

Tags:

About The Author

Latest News

గోదావరి జలాలను త్రాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించాలి... జిల్లా కలెక్టర్‌ దివాకర టిఎస్ గోదావరి జలాలను త్రాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించాలి... జిల్లా కలెక్టర్‌ దివాకర టిఎస్
*జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి* కాలువలు, రెగ్యులేటర్లు, చెరువులకు చేరుతున్న నీటి ప్రవాహంపై నిరంతర నిఘా
కల్లుగీత కార్మికుల సుదీర్ఘ పోరాటాల ఫలితమే పాపన్న విగ్రహ ఆవిష్కరణ
వెల్కటూరులో ‘మన పోలీస్ - మన ఊరు’ కార్యక్రమం
వీరభద్ర స్వామి, పోచమ్మ తల్లి ఆశీస్సులతో ..!    
ఖమ్మంలో రైతు కూలీల జాతీయ మహాసభలకు సన్నాహాలు
వృద్ధుల పట్ల గౌరవం – సమాజ ప్రగతికి ప్రతీక
22ఏ నిషేధిత భూములపై సమగ్ర విచారణ జరపాలి