- District News
- రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసిన మోడీ ప్రభుత్వం
రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసిన మోడీ ప్రభుత్వం
బి విజయ సారధి సిపిఐ జిల్లా కార్యదర్శి
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ ఆగస్టు 8 మహబూబాబాద్
ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి రాజ్యాంగ వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్న మోడీ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి అన్నారు
డోర్నకల్ మండల కేంద్రం రైల్వే స్టేషన్ సెంటర్లో సిపిఐ పాదయాత్ర ప్రచార యాత్రలను జిల్లా కార్యదర్శి బి విజయ సారధి,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి ప్రారంభిoచి* మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం యువతకు ఏటా కూటి ఉద్యోగాలు ఇస్తానని ప్రగల్పాలు పలికి ఇలాంటి ఉద్యోగ కల్పన చేయకపోవడం విద్యార్థుల ప్రతిష్టాత్మకమైన ప్రవేశ పరీక్షల పేపర్లు లీక్ కావడం, వ్యవసాయ కార్మికుల ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం, కార్పొరేట్ల సంపద గత 12 సంవత్సరాలుగా ఒక శాతం కుబేర్ల దగ్గర 46% సంపద పోగు పడటం, కేవలం మూడు శాతం సంపద మాత్రమే 50 శాతం అట్టడుగు వర్గాల తుల్లో ఉండడం అసమానతల తీవ్రతకు అద్దం పడుతుందని, వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ బ్యాంకులకు ఎగనామా పెట్టి విదేశాలకు పారిపోయిన తన అణువులను తీసుకురావకపోవడం, ఒక్క రూపాయ ధనాన్ని కూడా వెలికితీయకపోవడం, పెరిగిపోతున్న నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించకపోవడం మోడీ ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనం అని ఇలాంటి దివాళ కోరు ప్రభుత్వం అధికారంలో ఉండడానికి ఏమాత్రం అవకాశం లేదని తీవ్రంగా విమర్శించారు
డోర్నకల్ పట్టణము నుండి పాదయాత్రగా సిపిఐ బృందం,ఉయ్యాలవాడ,వెన్నారం, బూరుగుపాడు గొల్లచర్ల గ్రామం వరకు కొనసాగింది
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నెల్లూరు నాగేశ్వరరావు, మండల కార్యదర్శి తురక రమేష్, పట్టణ కార్యదర్శి, పట్టణ కార్యదర్శి ఎల్లావుల నరసింహారావు,కె ప్రబెష్, ప్రభాకర్, బుర్ర సమ్మయ్య, తురక రమేష్, కలగూర నాగరాజు,రేపాకుల పాపయ్య,వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు
Tags:
About The Author
Related Posts
Latest News
21 Aug 2026 21:01:39
*జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి*
కాలువలు, రెగ్యులేటర్లు, చెరువులకు చేరుతున్న నీటి ప్రవాహంపై నిరంతర నిఘా
