- District News
- సూధనపల్లి పాఠశాలలో ఉచిత షూ, బెల్ట్ ల పంపిణి ..
సూధనపల్లి పాఠశాలలో ఉచిత షూ, బెల్ట్ ల పంపిణి ..
లోకల్ గైడ్ సెప్టెంబర్ 26 కురవి
- ఉచిత షూ బెల్టుల పంపిణీ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీలం వెంకన్న...
- ప్రధానోపాధ్యాయులు ధరావత్ వెంకన్న...
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల సూధనపల్లి లో విద్యార్థులందరికీ ఉచిత షూ, బెల్ట్ లు పంపిణీ చేయడం జరిగింది .ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు మరియు స్కూల్ అసిస్టెంట్ (బయాలజికల్ సైన్స్ )అయిన శ్రీ ధరావత్ వెంకన్న అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ నీలం వెంకన్న పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ బడిలో చదివే పేద విద్యార్థులందరికీ ఉచిత పాఠ్యపుస్తకాలు, షూ, నోటుబుక్కులు, బెల్టులు, టై, స్కూల్ బ్యాగ్... మొదలైన కిట్ మొత్తం అందజేయనుంది. దీనిలో భాగంగానే ఈ రోజు ఉచిత షూ, బెల్టులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు .ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చిన్నం ప్రదీప్ కుమార్, ఎండి .అంజద్ పాషా, గాండ్ల బాలరాజు, బి. సరోజ, వి.శుభ, కె. సారంగం, ఏ .ప్రగతి,ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ రేఖ మాధవి, ఆయా నీలం వాసవి,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఎలమశెట్టి ధనమ్మ , అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
