గురవయ్య కుటుంబానికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పరామర్శ

Published On
గురవయ్య కుటుంబానికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పరామర్శ

 

కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 26 (లోకల్ గైడ్ న్యూస్) : పేరేపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చిక్కుల గురవయ్య ఇటీవల మృతిచెందడంతో, ఆయన కుటుంబాన్ని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ శుక్రవారం రాత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా గురవయ్య చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.గురవయ్య కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలను ఎమ్మెల్యే రాందాస్ నాయక్ గుర్తు చేసుకున్నారు. గురవయ్య కుటుంబానికి తాను, కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూరి రాంబాబు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు బోళ్ల రమేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు భానోత్ రామ్మూర్తి నాయక్, పెద్దబోయిన ఉమాశంకర్, కడియాల సుధాకర్, గుగులోత్ భీముడు, కారేపల్లి సర్పంచ్ మేదరి టోనీ, మైనార్టీ నాయకులు హనిఫ్, షేరు, డేగల ఉపేందర్, అడపా పుల్లారావు, చాగంటి చిన్న, గ్రామ కాంగ్రెస్ నాయకులు బచ్చలకూరి ఉపేందర్, కేలోత్ శీను, గణపారపు లక్ష్మీనారాయణ, వేములూరి కోటాచారి, సద్ద నాగేశ్వరరావు, ధనసరి వెంకన్న, వల్లపు అరుణ్, సోమనబోయిన కృష్ణ, అల్లెం సంపత్, యడ్ల వీరన్న, గణపారపు శీను, గణపారపు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

చాకలి ఐలమ్మ 131 వ జయంతి వేడుకలు చాకలి ఐలమ్మ 131 వ జయంతి వేడుకలు
            పెద్దపల్లి జిల్లా సెప్టెంబర్ 26 (లోకల్ గైడ్)సుల్తానాబాద్ పట్టణంలోనీ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు చాతరాజు రమేష్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ
ఉపాధి హామీపై సింగరేణి సర్పంచుల కసరత్తు
సూధనపల్లి పాఠశాలలో ఉచిత షూ, బెల్ట్ ల పంపిణి ..
మూసీ పునరుజ్జీవనం: ఒడ్డున వెలుగులు కాదు.. నదిలో స్వచ్ఛమైన నీరే నిజమైన ప్రగతి
అంబులెన్స్‌కూ అందని ఏజెన్సీ!
గురవయ్య కుటుంబానికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పరామర్శ
టోనీ చొరవతో డ్రైనేజీకి మోక్షం!