చంద్రుపట్ల ప్రభుత్వ పాఠశాలలో యూనిఫామ్స్, షూస్ అందజేత

Published On
చంద్రుపట్ల ప్రభుత్వ పాఠశాలలో యూనిఫామ్స్, షూస్ అందజేత

 వాజేడు, లొకల్ గైడ్ ప్రతినిధి  :-

వాజేడు మండలం చండ్రుపట్ల ఎంపీ యుపిఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే యూనిఫార్మ్స్ మరియు షూస్ సాక్సులు, బెల్టులను గురువారం చంద్రుపట్ల సర్పంచ్ సంధ్యారాణి చేతులమీదుగా పాఠశాల కమిటీ చైర్మన్ లలిత చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఉచితంగా యూనిఫామ్స్,షూస్ లాంటివి అందించడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్  మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించడం అనేది విద్యార్థుల్లో పేద,ధనిక అనే భేదాలు లేకుండా సమానత్వ భావనను సూచిస్తుందని కొత్త యూనిఫార్మ్స్, షూస్,సాక్షులు, బెల్టులు ఇవ్వడం వల్ల విద్యార్థుల్లో నూతన ఉత్సాహం కలుగుతుందని పాఠశాలకు వెళ్లాలని ఆసక్తిని పెంచుతుందని పాఠశాల ఆవరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న సంక్షేమ పథకాలని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉత్తమ విద్యా ఫలితాలను సాధించాలని సూచించారు.మా ఆహ్వానం మేరకు పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్న పాఠశాల కమిటీ చైర్మన్ గ్రామ సర్పంచ్ వార్డ్ మెంబర్స్ కు ,  గ్రామపంచాయతీ కార్యదర్శి గ్రామపంచాయతీ సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు, గ్రామ పెద్దలకు,యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సంతోష్  ఉపాధ్యాయులు నజీమ్ పాఠశాల కమిటీ చైర్మన్ గట్టి లలిత,సర్పంచ్ అనుముల సంధ్యారాణి,వార్డు మెంబర్స్ ఉషారాణి,నాగభూషణం,సమ్మయ్య,ప్రభాకర్, గ్రామపంచాయతీ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఆశాలకు రూ.18 వేలు ఇవ్వకపోతే నిరవధిక సమ్మె : గోనే యువరాజు ఆశాలకు రూ.18 వేలు ఇవ్వకపోతే నిరవధిక సమ్మె : గోనే యువరాజు
    నర్సంపేట, అక్టోబర్ 07 (లోకల్ గైడ్):  ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం వెంటనే ఇవ్వాలని
హైదరాబాద్–రంగారెడ్డి మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతం: 
నల్లబెల్లి మండలంలో యూత్ కాంగ్రెస్ దూకుడు : మూడు గ్రామాల్లో ఏకగ్రీవంగా నూతన కమిటీలు
తూము వివాదం - చెరువు కట్టపై ఉద్రిక్తత
వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో హెచ్ఐవి అవగాహన కార్యక్రమం,
కారేపల్లి కస్తూర్బా విద్యాలయంలో కలెక్టర్ దివాకర్.టి.ఎస్ ఆకస్మిక పరిశీలన
కారేపల్లి మండల కార్యాలయంలో పోషకాహార ప్రదర్శనలో కలెక్టర్ దివాకర టి.ఎస్