- District News
- ముత్యంపేట ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ముత్యంపేట ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, ఔషధాల నిల్వలు, రికార్డులను పరిశీలించారు.
ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల తీరుపై జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందేలా నిరంతరం పర్యవేక్షించాలని వైద్య సిబ్బందికి సూచించారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలకు వచ్చే ప్రతి ఒక్కరికీ సకాలంలో అవసరమైన వైద్య సేవలు, మందులు అందేలా సిబ్బంది బాధ్యతతో పనిచేయాలి” అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.
ఆస్పత్రి ప్రాంగణం, స్టోర్ రూమ్‌ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. వైద్య సేవలు అందించే ప్రదేశంలో పరిశుభ్రత అత్యంత ముఖ్యమైనది. ఆస్పత్రి పరిసరాలు ఆహ్లాదకరంగా స్వచ్ఛంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అని సూచించారు.
ఔషధాల నిల్వలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రోగులకు సకాలంలో మందులు పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు.
ప్రజలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలపై నమ్మకంతో వచ్చేలా సేవల నాణ్యతను మరింత మెరుగుపరచాలి. ప్రతి రోగితో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చూడాలి” అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్ వై గిరి, డిఎం మెన్ హెచ్ ఓ వెంకట్, సర్పంచ్ స్థానిక వైద్య అధికారులు, ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
