Dr.ప్రియాంక తల్లిదండ్రులను  పరామర్శించిన- డికె.స్నిగ్ద రెడ్డి

నిందితులను కఠినంగా శిక్షించాలి..

Published On
Dr.ప్రియాంక తల్లిదండ్రులను  పరామర్శించిన- డికె.స్నిగ్ద రెడ్డి

జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) ఆగస్టు 11
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలంలోని ఏక్లాస్ పురం గ్రామంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో కొందరు యువకులు కార్ తో నిర్లక్ష్యంగా ఢీకొట్టడంతో గాయలపాలై వారం రోజులపాటు మృత్యువుతో పోరాడి  మరణించిన పీజీ మెడికో విద్యార్థిని డాక్టర్ కనికే ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించిన బిజెపి జిల్లా యువ నాయకురాలు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణమ్మ కుమార్తె   డికె.స్నిగ్ద రెడ్డి 
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు టి. రామాంజనేయులు , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రరెడ్డి ,రాష్ట్ర కౌన్సిల్ మేంబర్ అక్కల రమాదేవి,జిల్లా ప్రధాన కార్యదర్శి లు రవి కుమార్ ఎక్బోటే,జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవ రెడ్డి,బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు బాబుల్ రెడ్డి, జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు సమత గౌడ్,కిసాన్ మోర్చా అధ్యక్షుడు దరూర్ కిష్టన్న ,మహిళ మోర్చా భారతి  మండల అధ్యక్షుడు గోపాల కృష్ణ, తదితరులు హాజరయ్యారు..

Tags:

About The Author

Latest News