ప్రతి ఇంటి పై జాతీయ జండా ఎగురావేయాలి.

మాజీ ఎమ్మెల్యే యెండాల లక్ష్మి నారాయణ

Published On
ప్రతి ఇంటి పై జాతీయ జండా ఎగురావేయాలి.

నిజామాబాద్​ జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ ), ఆగష్టు 11:

దేశ ప్రధాని నరేంద్ర మోదీ  ఇచ్చిన పిలుపు మేరకు ‘హర్​ గర్​ తిరంగా’లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని నిజామాబాదు అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం తన ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేశారు. జెండా ఎగురవేసిన అనంతరం యెండల మాట్లాడుతూ భారతీయులలో దేశభక్తిని, ఐక్యత శక్తిని పెంపొందించడం కోసం దేశ ప్రధాని మోదీ హర్​ గర్​ తిరంగా కార్యక్రమానికి పిలుపునిచ్చారన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి తమ దేశభక్తిని చాటుకోవాలని ఆయన పేర్కొన్నారు. దేశ విద్రోహశక్తులకు దేశభక్తితోనే సమాధానం చెప్పాలని ఆయన అన్నారు.

Tags:

About The Author

Latest News