వైద్య విద్యలో గుగులోత్ కిషోర్ నాయక్ ఘన విజయం

కిషోర్ నాయక్‌కు సర్పంచ్ బానోత్ హీరాలాల్ అభినందనలు

Published On
వైద్య విద్యలో గుగులోత్ కిషోర్ నాయక్ ఘన విజయం

 

 

కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 4, లోకల్ గైడ్ న్యూస్ : భాగ్యనగర్ తండా 10వ వార్డు సభ్యురాలు శ్రీమతి గుగులోత్ జ్యోతి, రాములు దంపతుల ద్వితీయ కుమారుడు గుగులోత్ కిషోర్ నాయక్ నిర్మల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS వైద్య విద్యలో ప్రవేశం పొందడం పట్ల భాగ్యనగర్ తండా సర్పంచ్ బానోత్ హీరాలాల్ హర్షం వ్యక్తం చేస్తూ కిషోర్ నాయక్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ఇష్టంతో, పట్టుదలతో చదివి వైద్య విద్యలో సీటు సాధించడం ఎంతో అభినందనీయమన్నారు. కిషోర్ నాయక్ తన భవిష్యత్ లక్ష్యాలకు అనుగుణంగా మరింత కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగి భాగ్యనగర్ తండాకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. పిల్లలను ఉన్నతంగా చదివిస్తూ వారి భవిష్యత్‌కు బాటలు వేస్తున్న తల్లిదండ్రులు జ్యోతి, రాములు దంపతులను సర్పంచ్ ప్రత్యేకంగా అభినందించారు. కిషోర్ నాయక్ విజయం గ్రామంలోని విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ భిక్కులాల్, వార్డు సభ్యులు గాంధీ, పద్మ, సుమ, మహేష్, భూలి, సంధ్య, నగేష్, కిషన్, దేవి, అంకి, మాజీ ఎంపీటీసీ రాంచందర్, జిల్లా నాయకులు గుగులోత్ భీముడు, గుగులోత్ మోతిలాల్ (జీఎం), యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు గుగులోత్ హర్ష నాయక్, మండల నాయకులు భగవాన్ దాస్ తదితరులు కిషోర్ నాయక్‌ను అభినందించి భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. గ్రామస్తులు సైతం కిషోర్ నాయక్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

About The Author

Latest News

ఆధ్యాత్మిక భావంతో  అట్టహాసంగా యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవం నిర్వహణ ఆధ్యాత్మిక భావంతో అట్టహాసంగా యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవం నిర్వహణ
---------------------------------------పెద్దపల్లి,  సెప్టెంబర్-17:(లోకల్ గైడ్ )----------------------------------------సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకలో  ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు,...
ఘనంగా ప్రజా పాలన దినోత్సవం.
విఠాయిపల్లి యూటర్న్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
టేకులపల్లి ప్రభుత్వ పాఠశాలలో విషపూరిత నాగుపాము  ప్రత్యక్షం.
విమోచన పోరాట యోధులకు గుడిపూడి తిరుమల రావు జోహార్లు
వీధి వీధిలో విజ్ఞేశ్వరునికి ప్రత్యేక పూజల సందడి
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న జాలిగం రాకేష్