కేటీఆర్, హరీశ్‌రావు అరెస్టులతో భగ్గుమన్న అశ్వారావుపేట

​కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలన పై బీఆర్‌ఎస్ కదనభేరి ​పట్టణంలో దద్దరిల్లిన బైక్ ర్యాలీ ప్రధాన రహదారిపై బైఠాయింపు

​ప్రజాపాలన లో 420 హామీల అమలు కోరుతూ 200కు పైగా దరఖాస్తులు
Published On
కేటీఆర్, హరీశ్‌రావు అరెస్టులతో భగ్గుమన్న అశ్వారావుపేట

 

 

 

లోకల్ గైడ్ : ​అశ్వారావుపేట
అసెంబ్లీ సమావేశాల వేళ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ అశ్వారావుపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ శ్రేణులు కదం తొక్కాయి. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్యాలను ఎండగడుతూ గులాబీ దళం చేపట్టిన ఆందోళనలతో పట్టణం దద్దరిల్లింది. అధినేత కేసీఆర్, కేటీఆర్ పిలుపు మేరకు స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చారు.IMG-20260907-WA0299
*​హోరెత్తిన బైక్ ర్యాలీ' స్తంభించిన ట్రాఫిక్*
ముందుగా పట్టణంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నినాదాలతో హోరెత్తిస్తూ ఎంపీడీవో కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉన్న ప్రధాన రహదారిపై బైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై గళమెత్తుతూ బైఠాయించడంతో కాసేపు రాకపోకలు స్తంభించాయి.
​*ప్రజాపాలన'లో వినూత్న నిరసన*
మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజావాణి/ప్రజాపాలన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన తెలిపాయి. కాంగ్రెస్ ఎన్నికల వేళ ఇచ్చిన 420 హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, కార్యకర్తలు క్యూ లైన్లలో నిలబడి అధికారులకు 200కు పైగా వినతిపత్రాలు సమర్పించారు.
*​మహిళా ప్రజాప్రతినిధులపై దాడి గర్హనీయం: బీఆర్‌ఎస్ నేతలు*
ఈ సందర్భంగా పార్టీ నాయకురాళ్లు కాసాని నాగ శేషా పద్మ, వగ్గెల పూజ, కౌన్సిలర్ డాక్టర్ ఉదయజ్యోతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చేందుకు 100 రోజుల్లో నెరవేరుస్తామని ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను దగా చేశారని, తీరా 1000 రోజులు గడిచినా ఒక్క హామీనీ అమలు చేయలేకపోయారని మండిపడ్డారు.
​ప్రజాసమస్యలపై నిలదీస్తున్న ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు మహిళా ప్రజాప్రతినిధులపై దౌర్జన్యానికి దిగడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగడం, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని పురుష పోలీసులతో ఈడ్చుకెళ్లడం దారుణమన్నారు. తెలంగాణ సంస్కృతికి భంగం కలిగిస్తూ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన కేసీఆర్‌తోనే సాధ్యమని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని స్పష్టం చేశారు.
​భారీగా తరలివచ్చిన శ్రేణులు
ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు జుజ్జురపు శ్రీరామ్ మూర్తి, గుడవర్తి వెంకటేశ్వరరావు, సత్యవరపు సంపూర్ణ, ఇస్లావత్ లక్ష్మి, మోటూరి మోహన్, ఎస్.కె. రఫీ, శెట్టిపల్లి రఘురాం, రాజనాల గంగాధర్, అఖిల్, కిరణ్, రమేష్, పాలవంచ జీవన్, నల్లపు రామారావు, కూనసోత్ నవీన్, బొల్లుకొండ చెన్నారావు, పానుగంటి లక్ష్మణ్ రావు, జుజ్జురి సత్యనారాయణ, సున్నం రామలక్ష్మయ్య, యుగంధర్, బుల్లెట్ రాజు, ప్రతాప్, వల్లెపు తిరుపతిరావు, లాజర్, కిశోర్, రాంబాబు, అమీర్, కూరపాటి నరేష్, నారం నాగ లక్ష్మి, జుజ్జురి సాయి, పానుగంటి చెన్నకేశవులు, కవులూరి నరేష్, కాటూరి నాగు, తగరం జగన్నాథంలతో పాటు మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, యువజన, విద్యార్థి, మహిళా విభాగాల నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News