మిలాద్-ఉన్-నబీ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలి.

మత సామరస్యానికి ప్రతీకగా వేడుకలు నిర్వహించాలి:  ఆమనగల్లు పోలీసులు

Published On
మిలాద్-ఉన్-నబీ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలి.

లోకల్ గైడ్, ఆమనగల్లు, ఆగస్టు 25:
రంగారెడ్డి జిల్లా 
ఆమనగల్లు పట్టణంలో ఈ నెల 26న నిర్వహించనున్న మిలాద్-ఉన్-నబీ ఊరేగింపును ప్రశాంత వాతావరణంలో, మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహించాలని ఆమనగల్లు పోలీసులు సూచించారు. ఈ మేరకు.
 ఆమనగల్లు పోలీస్‌స్టేషన్‌లో 
ఎస్ హెచ్ ఓ వెంకటేశ్వర్లు, ఎస్సై సంతోష్ రెడ్డి ఆధ్వర్యం లో
శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.
సమావేశానికి ముస్లిం మత పెద్దలు, మిలాద్-ఉన్-నబీ నిర్వాహకులు, హిందూ మత పెద్దలు, మున్సిపల్ చైర్మన్ పత్యా నాయక్, మున్సిపల్ కౌన్సిలర్లు, పోలీస్ సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా శాంతి, మత సామరస్యం, సోదరభావం, పరస్పర గౌరవం వంటి అంశాలపై చర్చించారు.
ఈ నెల 26న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వాహకులు, మత పెద్దలు, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఊరేగింపు మార్గం, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, సమయపాలన తదితర అంశాలపై నిర్వాహకులకు సూచనలు చేశారు.
ఊరేగింపు సమయంలో పోలీసులు సూచించిన మార్గాలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు, పుకార్లు, తప్పుదు సమాచారం ప్రచారం చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఆమనగల్లు పట్టణంలో అన్ని మతాల ప్రజలు పరస్పర సహకారంతో శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని, మిలాద్-ఉన్-నబీ వేడుకలను సోదరభావంతో విజయవంతంగా నిర్వహించాలని పోలీసులు కోరారు.

Tags:

About The Author

Latest News

సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి. సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి.
సిద్దిపేట, సెప్టెంబర్ 07(లోకల్ గైడ్): సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ పవన్ మృతి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బహుజన లెఫ్ట్ పార్టీ (బీఎల్‌పీ) సిద్దిపేట...
ఇది ప్రజాస్వామ్యమా రాక్షస రాజ్యమా?
ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో ఐపీఎస్‌ విద్యార్థుల ప్రతిభ
జర్నలిస్టులపై కలెక్టర్ నిర్లక్ష్యం తగదు ఫీజు రాయితీ జీవో వెంటనే విడుదల చేయాలి
నాడు ఫ్రెండ్లీ పోలీసు... నేడు రేవంత్ పోలీసు
రైతు కుటుంబానికి స్థిరమై న ఆదాయం కల్పించేలా ప్రణాళికలురూపొందించాలి
కనీస వేతనాల సలహా మండలి లో జాతీయ సంఘాలను చేర్చాలి