- District News
- Ranga Reddy
- "కోట్ల మణిపూసలు"
"కోట్ల మణిపూసలు"
షాద్నగర్ లోకల్ గైడ్
(1)
" శ్రీకర గణనాయక
ఇడుములు రానీయక
పాహిమాం విఘ్నేశ్వర
శుభము లిడు వినాయక"!
(2)
"జేజేలును చదువులమ్మ
కరుణించగను రావమ్మ
మణిపూసలు నే వ్రాయగ
పదము లివ్వు శారదమ్మ"!
(3)
"ప్రేమ తోడ పలకరింపు
మదికెంతో పులకరింపు
కపట బుద్ది కలిగియున్న
దేహమంత చీత్కరింపు"!
(4)
"మాట తీరు మార్చుకో
క్షేమం మెరిగి నడుచుకో
మమతలెన్నొ కలిగి యున్న
తల్లి మనసు పంచుకో"!
(5)
"పరాధీన జీవనం
నరకముతో సమానం
స్వేచ్ఛ తోడి బ్రతుకంతా
స్వర్గమయ కొలమానం"!
(6)
"కలిమియందు పొంగవద్దు
లేమిలోన క్రుంగ వద్దు
ఏ సమస్య లెదురైన
ధైర్యమెపుడు వీడవద్దు"!
(7)
"నడక తోడ ఆరోగ్యం
దూరమగు ననారోగ్యం
రోజు కొంత నడుస్తున్న
కలుగుతుంది సౌభాగ్యం"!
(8)
"మణిపూసల మణిహారం
రాజహంసల విహారం
చూడ తెలియు పాఠకులకు
రసగుళికల నయగారం "!
✍️ దయానందం కోట్ల
రిటైర్డ్ టీచర్, షాద్ నగర్.
