సీఎం మాటకూ విలువివ్వరా? – రేవంత్ రెడ్డి హెచ్చరించినా మారని అధికారుల తీరు !

అయితే, సీఎం ఆదేశాలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయా?

కింది స్థాయి అధికారులకు సీఎం  మాటంటే గౌరవం లేదా ? అనే ప్రశ్నలు ఇప్పుడు వికారాబాద్ జిల్లా కేంద్రంలో వెలిగిన పగటి వీధి దీపాలను చూస్తుంటే ఉత్పన్నమవుతున్నాయి. - సీఎం ఆదేశాలకు బగ్గుమంటున్న నిర్లక్ష్యం
Published On
సీఎం మాటకూ విలువివ్వరా? – రేవంత్ రెడ్డి హెచ్చరించినా మారని అధికారుల తీరు !

 

 వికారాబాద్ జిల్లా లోకల్ గైడ్ జిల్లా బ్యూరో ప్రతినిధి : 
  
తెలంగాణ రాష్ట్రంలోని
విద్యుత్ పొదుపు పాటించాలని, ముఖ్యంగా మున్సిపాలిటీలు, పంచాయతీల్లో పగటిపూట స్ట్రీట్ లైట్లు వెలగకుండా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కానీ, సొంత జిల్లా అయిన వికారాబాద్‌లోనే సీఎం మాటలకు బుట్టదాఖలు చేస్తూ, పట్టపగలు భాస్కరుడు వెలుగుతున్న వేళ కూడా వీధి దీపాలు ధగధగా వికారాబాద్ రైల్వే గేట్ దగ్గర వెలుగుతున్నాయి. ముఖ్యమంత్రి చెప్పిన మాటలను క్షేత్రస్థాయి అధికారులు ఎంత తేలికగా తీసుకుంటున్నారో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది.
బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం వల్లే అధికారులకు, సిబ్బందికి భయం లేకుండా పోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 రైతుల ఆక్రందన – పగలు లైట్లు, రాత్రి చీకట్లు
ఒకవైపు రైతులు సాగునీటి కోసం, పంIMG-20261028-WA0306టలను కాపాడుకోవడం కోసం విద్యుత్ దొరకక అల్లాడిపోతున్నారు.
వికారాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో లో-వోల్టేజ్ సమస్యలు, అసాధారణ విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించింది.
పగటిపూట కరెంట్ రాక రాత్రివేళల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి పొలాల బావుల వద్దకు రైతులు వెళ్లాల్సి వస్తోంది.
రైతులు కరెంట్ లేక తిప్పలు పడుతుంటే... పట్టణంలో మాత్రం సూర్యుడికి పోటీగా కరెంట్ లైట్లు వెలిగించి విద్యుత్‌ను నీళ్లలా వృధా చేయడం ఏ రకమైన పాలన అని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు.
 ప్రజాధనం వృధాకు బాధ్యులెవరు?
వికారాబాద్ మున్సిపల్ పరిధిలో పగటిపూట అనవసరంగా వెలిగే ప్రతి లైటు వల్ల విద్యుత్ బిల్లుల భారం పడుతుంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల వృధా అయ్యే ఈ బిల్లులను ప్రజలు కట్టే పన్నుల డబ్బుల నుంచే చెల్లిస్తారు.
సీఎం హెచ్చరించిన తర్వాత కూడా ఇలాంటి అలసత్వం ప్రదర్శించడం అంటే ప్రజల సొమ్మును బూడిదలో పోయడమే.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం (ఆటోమేటిక్ స్విచ్‌లు/టైమర్లు) అందుబాటులో ఉన్నా, వాటిని సరిగ్గా నిర్వహించకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట.
తక్షణమే చర్యలు అవసరం
ఈ వ్యవహారంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది:
బాధ్యులపై వేటు: సీఎం హెచ్చరికలను బేఖాతరు చేస్తూ నిర్లక్ష్యం వహించిన   పగటిపూట లైట్లు వెలుగుతున్న ప్రాంతాలను గుర్తించి విద్యుత్ నిలిపివేలని ప్రజలు కోరుతున్నారు.
రైతులకు ప్రాధాన్యం ఆదా చేసిన విద్యుత్‌ను సరైన సమయానికి రైతులకు సరఫరా చేసి వ్యవసాయాన్ని నిలబెట్టాలి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఇచ్చిన ఆదేశాలకే దిక్కులేకుండా పోతే ఇక సామాన్య ప్రజల సమస్యలను కింది స్థాయి అధికారులు ఏమాత్రం పట్టించుకుంటారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు నిద్రమత్తు వీడి, పగటిపూట వెలుగుతున్న వీధి దీపాలను ఆర్పేలా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ వృధాకు బాధ్యులైన వారిపై సీఎం అన్నట్లుగానే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Tags:

About The Author

Latest News

సీఎం మాటకూ విలువివ్వరా? – రేవంత్ రెడ్డి హెచ్చరించినా మారని అధికారుల తీరు ! సీఎం మాటకూ విలువివ్వరా? – రేవంత్ రెడ్డి హెచ్చరించినా మారని అధికారుల తీరు !
కింది స్థాయి అధికారులకు సీఎం  మాటంటే గౌరవం లేదా ? అనే ప్రశ్నలు ఇప్పుడు వికారాబాద్ జిల్లా కేంద్రంలో వెలిగిన పగటి వీధి దీపాలను చూస్తుంటే ఉత్పన్నమవుతున్నాయి....
పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 58 సిసిటివి కెమెరాల ప్రారంభించిన శంషాబాద్ జోన్ డీసీపీ బి. రాజేష్
కరువు కోరల్లో కారేపల్లి రైతాంగం.. పరిహారం చెల్లించాలి!
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి
అమర పోలీసు వీరులకు ఘన నివాళి: వికారాబాద్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో బృహత్ రక్తదాన శిబిరం
_దుబాయ్ వ్యాపార పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న ఎస్‌ఎల్‌ఎన్ గ్రూప్ ప్రతినిధులు