ప్రశ్నిస్తే కేసులు నమోదు.. ఇదేనా బీజేపీ పాలన?

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్

Published On
ప్రశ్నిస్తే కేసులు నమోదు.. ఇదేనా బీజేపీ పాలన?

 

 


మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

 

ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణచివేయడం ప్రజాస్వామ్య పాలన కాదని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు.బెల్లంపల్లి పట్టణంలో పాత రామ టాకీస్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఉత్తరాఖండ్ లో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ పై బిజెపి ప్రభుత్వం అక్రమ కేసులు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయడం,ప్రజల హక్కులను కాలరాయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని అన్నారు.ప్రజల తరపున నిలబడి ప్రశ్నిస్తే కేసులు పెట్టి భయపెట్టాలని చూడటం సరికాదన్నారు.

ప్రశ్నిస్తే కేసులు ప్రజల సమస్యలను ప్రస్తావిస్తే అణచివేత,ఇదేనా బిజెపి పాలన అంటు ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును ఎవరు హరించలేరని,ప్రజల గొంతుకగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.ప్రభుత్వ విధానాలపై ప్రజలకు అనుమానాలు ఉన్నప్పుడు వాటికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు.కేసులు,బెదిరింపులతో ప్రజా ఉద్యమాలను అడ్డుకోలేరని పేర్కొన్నారు.ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి,పట్టణ అధ్యక్షులు బండి ప్రభాకర్ యాదవ్,నాయకులు దేవసాని ఆనంద్,చిలుముల శంకర్,ఎస్ఐఆర్ కోఆర్డినేటర్ ఖాజా,ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మట్టి గణపతిని పూజిద్దాం ప్రకృతిని కాపాడుకుందాం మట్టి గణపతిని పూజిద్దాం ప్రకృతిని కాపాడుకుందాం
లోకల్ గైడ్ షాద్ నగర్  కేశంపేట: వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కేశంపేట మాజీ జడ్పిటిసి విశాల...
ముందస్తు అరెస్టులు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు
ముగిసిన శ్రావణ మాస భజన కార్యక్రమం.
మహాదేవపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ ధర్నా
మట్టి వినాయకుని పూజిద్దాం..పర్యావరణాన్ని కాపాడుదాం* - కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో మట్టి వినాయకుల తయారీపై విద్యార్థులకు అవగాహన
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే మహాశిల్పులు గురువులు.
మృతురాలి రేషన్‌ కార్డుతో రెండేళ్లుగా బియ్యం స్వాహా? - చనిపోయిన బాలమ్మ పేరుతోనే కార్డు కొనసాగింపు.