- District News
- _రామకృష్ణ అన్న కుటుంబంలో ఘనంగా దసరా ఉత్సవాలు
_రామకృష్ణ అన్న కుటుంబంలో ఘనంగా దసరా ఉత్సవాలు
_భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు.. కుటుంబ సభ్యుల మధ్య ఆనందోత్సాహాలు

దసరా పండుగను పురస్కరించుకుని రామకృష్ణ అన్న కుటుంబ సభ్యులు శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులంతా కలిసి భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు పొందారు. సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు చేపట్టి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ సందర్భంగా అమ్మవారి అనుగ్రహం తమ కుటుంబంతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉండాలనిఆకాంక్షించారు.ప్రజలందరూసుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.కుటుంబ సభ్యులందరూ ఒకచోట చేరి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ దసరా వేడుకల్లో పాల్గొనడంతో ఇంటిల్లిపాది సందడి నెలకొంది. భక్తి, సంప్రదాయం, ఆప్యాయతల కలయికగా రామకృష్ణ అన్న కుటుంబంలో దసరా సంబరాలు అంబరాన్నంటాయి.
