మానవత్వానికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అండ.. పేద మహిళకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ!

తీవ్ర అనారోగ్యంతో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న భూక్యా లక్ష్మికి ఆర్థిక భరోసా.. ప్రమాదంలో గాయపడి విశ్రాంతి తీసుకుంటున్నా సేవలో వెనక్కి తగ్గని సర్పంచ్ భర్త సంతోష్

Published On
మానవత్వానికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అండ.. పేద మహిళకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ!

 

 

కారేపల్లి, అక్టోబర్ 21 (లోకల్ గైడ్ న్యూస్):

ఆపదలో ఉన్న పేద కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు పాటిమీదగుంపు సర్పంచ్ జి. సుజాత భర్త సంతోష్. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాటిమీదగుంపు గ్రామానికి చెందిన భూక్యా లక్ష్మి ఆర్థిక ఇబ్బందులను తెలుసుకున్న సంతోష్, ఆమెకు వైద్య ఖర్చుల కోసం రూ.5 లక్షల ఎల్‌ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరుకు కృషి చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ, పేద మహిళకు సాయం అందించాలనే సంకల్పంతో ముందడుగు వేశారు. ఈ విషయాన్ని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన స్పందించి రూ.5 లక్షల ఎల్‌ఓసీపై సంతకం చేసి పంపించారు. దీంతో వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబానికి ఊరట లభించింది. ప్రమాదంలో గాయపడినా.. పేదల కష్టాలకు చలించి సాయం అందించేందుకు ముందుకొచ్చిన సంతోష్ సేవాభావాన్ని, తక్షణమే స్పందించి వైద్య సాయం అందేలా సహకరించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్ చొరవను గ్రామస్థులు అభినందిస్తున్నారు.

Tags:

About The Author

Latest News

దసరా వేడుకల్లో ఆత్మీయ పలకరింపు. దసరా వేడుకల్లో ఆత్మీయ పలకరింపు.
లోకల్ గైడ్/తాండూర్:విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని యాలాల్ పీఏసీఎస్ చైర్మన్ భీమ్‌శెట్టి అనిల్‌కు అక్కంపల్లి గ్రామ పెద్దలు దసరా శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా ఆయనను ఆత్మీయంగా కలిసి...
మానవత్వానికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అండ.. పేద మహిళకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ!
రేణుక ఎల్లమ్మ పల్లకి సేవలో  పూజారి పాండు.
టి ఐ సి సి ఐ తెలంగాణ రాష్ట్ర చాప్టర్,రాష్ట్ర కోఆర్డినేటర్‌గా ఎన్. బాలు మహేంద్ర నాయక్ నియామకం .
అమ్మవారి ఆశీస్సులతో తాండూరు సుభిక్షంగా ఉండాలి.
_రామకృష్ణ అన్న కుటుంబంలో ఘనంగా దసరా ఉత్సవాలు
పుల్లారెడ్డి స్వీట్ హౌస్ అధినేత బండ శ్రీనివాస్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.