- District News
- ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు మరింత పెరగాలి. విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో ఉపాధ్యాయుల పా...
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు మరింత పెరగాలి. విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం.
క్షేత్రస్థాయి పర్యవేక్షణను నిరంతరం కొనసాగించాలి – అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి
Published On
By Ram Reddy
జిల్లా బ్యూరో, (లోకల్ గైడ్ ):
బుధవారం జిల్లా కలెక్టర్ భవనంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి, స్టేట్ టాస్ డైరెక్టర్ లింగయ్య ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు వివిధ విద్యా అంశాలపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లాలోని అన్ని మండలాల విద్యాధికారులు (ఎం ఈ ఓ ), కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, సి ఆర్ పీ లు, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండలాల వారీగా విద్యాశాఖ
కార్యక్రమాల అమలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, పాఠశాలల పనితీరు, విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాల మెరుగుదల, క్షేత్రస్థాయి పర్యవేక్షణ తదితర అంశాలపై అదనపు కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు. ప్రతి మండలంలోని పరిస్థితులను సంబంధిత ఎం ఈ ఓ లు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత గొప్పదని పేర్కొన్నారు. విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా వారిలో క్రమశిక్షణ, నైతిక విలువలు, బాధ్యతాయుతమైన పౌరసత్వ భావనను పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు మరింత పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ప్రతి అర్హత కలిగిన విద్యార్థి పాఠశాలలో చేరేలా తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న విద్య, మౌలిక వసతులు, వివిధ ప్రభుత్వ సదుపాయాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థుల నమోదు పెంపుతో పాటు వారు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడం, విద్యా ప్రమాణాలను పెంపొందించడం ప్రతి ఉపాధ్యాయుడి ప్రధాన బాధ్యతగా భావించాలని అదనపు కలెక్టర్ సూచించారు. పాఠశాలల స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
స్టేట్ టాస్ డైరెక్టర్ శ్రీ లింగయ్య మాట్లాడుతూ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఎం ఈ ఓ లు క్షేత్రస్థాయిలో పాఠశాలలను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించారు. పాఠశాలల్లో వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి, ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు అందించాలని తెలిపారు. క్షేత్రస్థాయి పర్యవేక్షణ నిరంతరం కొనసాగినప్పుడే విద్యాశాఖ కార్యక్రమాల అమలులో ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల పనితీరును మెరుగుపరిచేందుకు ఎం ఈ ఓ లు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, సి ఆర్ పీ లు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యార్థుల నమోదు, హాజరు, అభ్యసన ఫలితాలు తదితర అంశాలపై నిరంతరం దృష్టి సారించి అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.
జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు సమావేశంలో సమీక్షించిన అంశాలు, శాఖాపరంగా చేపడుతున్న కార్యక్రమాలు, మండలాల వారీగా విద్యా పరిస్థితులను వివరించారు. అనంతరం అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, సి ఆర్ పీ లకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు, అన్ని మండలాల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, సి ఆర్ పీ లు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
26 Aug 2026 08:52:15
ఖమ్మం జిల్లా, కారేపల్లి, ఆగస్టు 25 ( లోకల్ గైడ్ ) :
కారేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద వన మహోత్సవ
