ఇథనాల్ ఫ్యాక్టరీల అనుమతులు రద్దు చేయాలి: అఖిలపక్ష నాయకులు

Published On
ఇథనాల్ ఫ్యాక్టరీల అనుమతులు రద్దు చేయాలి: అఖిలపక్ష నాయకులు

సిద్దిపేట ఆగస్ట్ 11(లోకల్ గైడ్):

బెజ్జంకి మండలం గుగ్గిల్ల, పోతారం గ్రామాల శివార్లలో ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఇథనాల్ ఫ్యాక్టరీల ఏర్పాటుతో పర్యావరణ కాలుష్యం, దుర్వాసన, నీటి కాలుష్యం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీల వల్ల స్థానిక ప్రజల జీవనానికి, పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి అనుమతులను రద్దు చేయాలని కోరారు.ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు మహేందర్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, డీఎస్పీ పార్టీ మండల ఇన్‌చార్జి లింగాల సురేష్, సీపీఐ నాయకులు బోనగిరి రూపేష్, బీఎస్పీ నాయకులు నిషాని సురేష్ తదితర అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News