నరసన్న పల్లి పాఠశాలలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పరిశీలించిన

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Published On
నరసన్న పల్లి పాఠశాలలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పరిశీలించిన

కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 22 లోకల్ గైడ్

కామారెడ్డి జిల్లా నరసన్న పల్లి గ్రామంలోని  పాఠశాలలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్‌  ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న పనుల పురోగతిని సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల వివరాల పరిశీలన, దరఖాస్తుల స్వీకరణ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.
ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు సక్రమంగా నమోదయ్యేలా, అనర్హులైన వివరాలు తొలగించే ప్రక్రియలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.
ప్రజలకు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై అవసరమైన అవగాహన కల్పిస్తూ, వారి నుంచి వచ్చే దరఖాస్తులు, అభ్యంతరాలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ హిమబిందు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం,గుండ్లగడ్డ కిష్టబావి అన్న ప్రసాదవితరణ   శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం,గుండ్లగడ్డ కిష్టబావి అన్న ప్రసాదవితరణ  
          జనగామ పట్టణంలో గుండ్లగడ్డ కిష్టబావి 9వ రోజు గణేష్  నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, అన్నప్రసాద వితరణ   కార్యక్రమానికి దాత:- మెట్టు సురేష్,వందన, దుబ్బాక బాలయ్య, పద్మ,
క్రషర్‌ నిలిపివేయాలంటూ  నిరాహార దీక్షలు
విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం
భైంసాలో ఘనంగా ప్రారంభమైన గణేష్ నిమజ్జనోత్సవం
ఎన్ఎస్ఎస్ఆధ్వర్యంలో ప్రభుత్వజూనియర్ కళాశాల మధిర ఏక్ పెడ్ మాకే నామ్ 2వరోజుప్రోగ్రాం
భాజపా టీచర్స్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా డా. నెల్లూరి బెనర్జీ
నరసన్న పల్లి పాఠశాలలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పరిశీలించిన