భైంసాలో ఘనంగా ప్రారంభమైన గణేష్ నిమజ్జనోత్సవం

ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్‌తో కలిసి తొలి గణేష్ నిమజ్జనం చేసిన జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల,

Published On
భైంసాలో ఘనంగా ప్రారంభమైన గణేష్ నిమజ్జనోత్సవం

 

 

నిర్మల్ : లోకల్ గైడ్:
భైంసా పట్టణంలో గణేష్ నిమజ్జనోత్సవం ఘనంగా ప్రారంభమైంది. గడ్డెన్న వాగు ప్రాజెక్టు నిమజ్జన ప్రదేశంలో క్రేన్ సహాయంతో తొలి గణపతిని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్తో కలిసి నిమజ్జనం చేసి ఉత్సవాలను ప్రారంభించారు.
నిమజ్జనోత్సవం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం 700 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ, 14 మంది డీఎస్పీలు, 18 మంది సీఐలు, ఎస్సైలు మరియు ఇతర పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.

నిమజ్జన శోభాయాత్ర మార్గాలు, ప్రధాన కూడళ్లు, నిమజ్జన ప్రదేశం, పరిసర ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. 100కు పైగా సీసీ కెమెరాలు, 2 డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టి, భక్తులు మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు సహకరిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు. శోభాయాత్ర సందర్భంగా పోలీసుల సూచనలు, ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా, భైంసా ఏఎస్పీ సాయి కుమార్, భైంసా అదనపు కలెక్టర్ అజ్మీరా సాకేత్, భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రేయ, బబ్లు మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం,గుండ్లగడ్డ కిష్టబావి అన్న ప్రసాదవితరణ   శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం,గుండ్లగడ్డ కిష్టబావి అన్న ప్రసాదవితరణ  
          జనగామ పట్టణంలో గుండ్లగడ్డ కిష్టబావి 9వ రోజు గణేష్  నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, అన్నప్రసాద వితరణ   కార్యక్రమానికి దాత:- మెట్టు సురేష్,వందన, దుబ్బాక బాలయ్య, పద్మ,
క్రషర్‌ నిలిపివేయాలంటూ  నిరాహార దీక్షలు
విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం
భైంసాలో ఘనంగా ప్రారంభమైన గణేష్ నిమజ్జనోత్సవం
ఎన్ఎస్ఎస్ఆధ్వర్యంలో ప్రభుత్వజూనియర్ కళాశాల మధిర ఏక్ పెడ్ మాకే నామ్ 2వరోజుప్రోగ్రాం
భాజపా టీచర్స్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా డా. నెల్లూరి బెనర్జీ
నరసన్న పల్లి పాఠశాలలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పరిశీలించిన