రైతులు రసాయనాలు తగ్గించి సేంద్రియ పద్ధతిలో సాగు చేయాలి.

నల్లు సుధాకర్ రెడ్డి ఆత్మ చైర్మన్

Published On
రైతులు రసాయనాలు తగ్గించి సేంద్రియ పద్ధతిలో సాగు చేయాలి.

 లోకల్ గైడ్ ఆగస్టు 28 మహబూబాబాద్ 

నల్లు సుధాకర్ రెడ్డి ఆత్మ చైర్మన్ మాట్లాడుతూ 
 రసాయనాలు అధిక మొతాదులో వాడకుండా  సేంద్రియ పద్ధతిలో  రైతులు సాగు నిర్వహించాలని ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి అన్నారు 
 సీరోల్ మండలం కాంపల్లి రైతు వేదికలో ఆత్మ కమిటీ అద్వర్యంలో రైతు అవగాహన సదస్సు ప్రారంభించిన సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో చెరువులు,కుంటల్లో నీరు లేదు, భూగర్భజలాలు రోజురోజుకు అడుగంటి పోతూ, జలాశయాల నుండి ఒక చుక్క నీరు వచ్చే పరిస్థితి లేనందువలన వరి సాగును తగ్గించుకొని, తక్కువ నీటితో పండే పంటలైన పప్పు, నూనె,చిరు ధాన్యాల మరియు కూర గాయలు పంటలపై రైతులు దృష్టి సారించాలని కోరారు                                       పది సoవత్సరాలక్రితం ఎకరా వరికి 80 కిలోల యూరియా వాడితే క్రమంగా పెరిగి నేడు ఎకరాకు150 కిలోల యూరియా వాడుతున్నామని, పదేళ్ళలో సాగు పెట్టుబడి 12నుండి 15 శాత పెరిగిందని, ఆదాయం మాత్రం 4నుండి 5శాతం మాత్రమే పెరిగిందని,రైతులు ఇది గమనించి రసాయనాలు, ఎరువులు అధిక మోతాదులో వాడకుండా,సేంద్రియ ఎరువులతో ప్రకృతి సాగు చేయడం వలన  పెట్టుబడులను తగ్గించుకొని నాణ్యమైన పంటలతో అధిక లాభాలు గడించవచ్చని అదేవిధంగా పంట మార్పిడి ద్వారా భూసారాన్ని పరిరక్షించుకునే, వైవిధ్యమైన పంటలతో రైతులకు సమాజానికి మేలు కలుగుతుందని అన్నారు 
శాస్త్రవేత్తలు,వ్యవసాయ నిపుణులు ఇచ్చే సూచనలను, మెలుకువలను రైతులు తప్పనిసరిగా పాటించి సాగును ఆదునీకరించుకోని, లాభలు పొందాలని కోరారు 
 ఈ సదస్సు  మండల వ్యవసాయ అధికారిని చాయారాజ్  అధ్యక్షతన జరగగా టెక్నికల్ ఏవో శ్రీదేవి,ఏ ఓ వాహిని,సర్పంచ్ రేపాకుల యల్లమ్మ,ఏ ఈ ఓ లు భరత్,సురేష్,కరుణాకర్ రెడ్డి  మరియు రైతులు వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News