- District News
- Khammam
- కన్నీటి వేళ కదిలొచ్చిన స్నేహబంధం...
కన్నీటి వేళ కదిలొచ్చిన స్నేహబంధం...
రమేష్ కుటుంబానికి డాక్టర్ బాధవత్ రవి పరామర్శ
Published On
By Ram Reddy
ఖమ్మం జిల్లా, కారేపల్లి(సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగష్టు 7 : మాదారం గ్రామంలోనీ మిత్రుడు వంకుడోత్ రమేష్ తల్లి దశదిన కార్యక్రమానికి డాక్టర్ బాధావత్ రవి, గ్రామ సర్పంచ్ అజ్మీరా ఉమా నరేష్‌తో పాటు చిన్ననాటి స్నేహితులు హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. కుటుంబానికి ఎల్లప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ అండగా ఉంటామని మిత్రులు భరోసా ఇచ్చారు. ఆపద సమయంలో మిత్రుడికి తోడుగా నిలవడమే నిజమైన స్నేహానికి నిదర్శనమని పేర్కొన్నారు. చిన్ననాటి నుంచి కొనసాగుతున్న తమ స్నేహబంధాన్ని గుర్తు చేసుకుంటూ మిత్రులంతా కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. బాల్య జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అప్పటి అనుభవాలను పరస్పరం పంచుకున్నారు. జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినా చిన్ననాటి స్నేహం మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కష్టసుఖాల్లో ఒకరికొకరు అండగా నిలుస్తూ, భవిష్యత్తులోనూ తమ స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని మిత్రులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో మిత్రబృందం మధ్య ఉన్న ఆత్మీయత, అనుబంధం మరోసారి ప్రతిబింబించింది.
Tags:
About The Author
Related Posts
Latest News
07 Aug 2026 19:39:23
ముఖ్యఅతిథిగా హాజరైన బిజెపి జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ కుమార్.
- శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన పూజారి పాండు.
