కాటారం మాజీ సర్పంచ్ కొర్ర మనోహర్ నాయక్ మృతికి ఉపాధి హామీ కూలీల సంతాపం

Published On
కాటారం మాజీ సర్పంచ్ కొర్ర మనోహర్ నాయక్ మృతికి ఉపాధి హామీ కూలీల సంతాపం


కాటారం, లోకల్ గైడ్,
భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ కొర్ర మనోహర్ నాయక్ ఇటీవల అకాల మరణం చెందడం పట్ల కాటారం గ్రామ ఉపాధి హామీ కూలీలు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.
సోమవారం ఉపాధి హామీ పనుల ప్రదేశంలో ఉపాధి కూలీలందరూ ఒకచోట చేరి ఆయన మృతికి సంతాపంగా ఒక నిమిషం పాటు మౌనం పాటించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు.
ఈ సందర్భంగా కొట్టే శ్రీహరి మాట్లాడుతూ.. మనోహర్ నాయక్ తన సర్పంచ్ పదవీ కాలంలో గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారన్నారు. ముఖ్యంగా పేద ప్రజల సంక్షేమం కోసం, గ్రామంలో మౌలిక వసతుల కల్పన కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. ఆయన అందరితో కలుపుగోలుగా, ఆప్యాయంగా ఉండేవారని, అందరికీ అందుబాటులో ఉండే నాయకుడని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం గ్రామానికి, కుటుంబానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సంతాప కార్యక్రమంలో కొట్టే శ్రీహరి, చీమల సత్యం, తోట కిట్టయ్య, పల్నాటి మల్లేష్, కొట్టే జనార్ధన్, ఆడవాళ్ళ రాజయ్య, దేవేందర్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ తో పాటు సుమారు 150 మంది ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు,

Tags:

About The Author

Latest News

ఎన్కతల గ్రామంలో  పశువుల నీటి తొట్టి నిర్మాణానికి మార్కింగ్ ఎన్కతల గ్రామంలో  పశువుల నీటి తొట్టి నిర్మాణానికి మార్కింగ్
    లోకల్ గైడ్, మోమిన్ పేట్ వికారాబాద్ జిల్లా : మోమిన్ పేట మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో పశువుల దాహార్తిని తీర్చేందుకు గ్రామ పంచాయతీ మరియు
ఓట్‌చోరీపై  పోరాటం చేస్తాం - కాంగ్రెస్ పార్టీ నాయకులు. 
డిగ్రీ, గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన యువత ఓటు నమోదు చేసుకోవాలి బి ఆర్ ఎస్ కాటేదాన్ డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్.                                              
తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్–2026 లో గెలుపొందిన విజేతలకు ట్రోఫీలు, ప్రైజ్ మనీ అందజేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి. 
సింగరేణి మండల గౌడ సంఘం అధ్యక్షుడిగా ఆరెళ్ల రవి గౌడ్
మేధావుల గళం.. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా!
నర్సంపేట మండలంలో పైపులైన్ లీకేజీతో మిషన్ భగీరథ వృథాగా పోతున్న నీరు