#Draft: Add Your Title

Published On
#Draft: Add Your Title

 

IMG-20261026-WA0212

మహబూబాబాద్ జిల్లా  కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో 
శాఖల వారీగా బ్యాక్ లాక్ వేకెన్సీల నివేదికను వెంటనే సమర్పించాలి.
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్  అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్.
మహబూబాబాద్ జిల్లా 
 కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు రెవెన్యూ కె అనిల్ కుమార్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు హౌసింగ్ పిడి పురుషోత్తం, డిఆర్ఓ నాగలక్ష్మి, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, సంబంధిత అన్ని విభాగాల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు,

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లావ్యాప్తంగా వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజావాణి కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులను పరిశీలించి వేగంగా పరిష్కరించాలని, జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని విభాగాలకు సంబంధించి బ్యాక్లాగ్ వేకెన్సీ ల వివరాలను తక్షణమే నివేదికను అందించాలని, సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 

ఎల్ ని నో  కారణంగా జిల్లా వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని, వసతి గృహాల నిర్వహణ, కార్యాలయ విధుల ముఖచిత్రం హాజరు, శాఖల పరిధిలో పెండింగ్లో ఉన్న అన్ని పనులను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. 

సోమవారం వివిధ మండలాల నుండి జిల్లా,డివిజన్, మండలాల వారీగా మొత్తం (134)దరఖాస్తులు వచ్చాయి,

నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామానికి చెందిన ఇసంపెల్లి రమేష్ తాను ఒంటరిగా ఉంటూ పూరి గుడిసెలో నివసిస్తున్నానని తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని కోరారు.

సీరోలు మండలం మన్యగూడెం తాల్య తండకు చెందిన భీమా ఎన్నో ఏళ్లుగా తాము సాగుచేసుకుంటున్న భూమి వేరే ఇతర వ్యక్తులపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని విచారణ చేసి మా యొక్క భూమిని మా పేరుపై రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగలరని కోరారు.

తెలంగాణ రాష్ట్ర దళిత బందు సాధన సమితి దళితబందు బాధితులు తమ ఎకౌంట్లలో రెండో విడత దళితబందు డబ్బులు 2 లక్షల రూపాయలను జమచేయాలని కోరారు.
డోర్నకల్ మండలం గుర్రాల కుంట గ్రామానికి చెందిన ఇస్లావత్ మాన్ సింగ్ తమకు పూర్వీకుల నుండి సంక్రమించిన భూమిని  అధికారులు వేరేవారికి పట్టా చేస్తారని చెపుతున్నారని పట్టాపాసు పుస్తకాల ప్రకారం తమకు ఉన్న భూమిని వేరే ఇతర వ్యక్తులకు పట్టా చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో న్యాయ సేవ సంస్థ ప్రతినిధి, అన్ని విభాగాల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపర్డెంట్లు, పరిపాలన అధికారి పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఎన్కతల గ్రామంలో  పశువుల నీటి తొట్టి నిర్మాణానికి మార్కింగ్ ఎన్కతల గ్రామంలో  పశువుల నీటి తొట్టి నిర్మాణానికి మార్కింగ్
    లోకల్ గైడ్, మోమిన్ పేట్ వికారాబాద్ జిల్లా : మోమిన్ పేట మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో పశువుల దాహార్తిని తీర్చేందుకు గ్రామ పంచాయతీ మరియు
ఓట్‌చోరీపై  పోరాటం చేస్తాం - కాంగ్రెస్ పార్టీ నాయకులు. 
డిగ్రీ, గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన యువత ఓటు నమోదు చేసుకోవాలి బి ఆర్ ఎస్ కాటేదాన్ డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్.                                              
తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్–2026 లో గెలుపొందిన విజేతలకు ట్రోఫీలు, ప్రైజ్ మనీ అందజేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి. 
సింగరేణి మండల గౌడ సంఘం అధ్యక్షుడిగా ఆరెళ్ల రవి గౌడ్
మేధావుల గళం.. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా!
నర్సంపేట మండలంలో పైపులైన్ లీకేజీతో మిషన్ భగీరథ వృథాగా పోతున్న నీరు