రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణ తరగతులు

Published On
రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణ తరగతులు

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

 

పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తుల చేసుకున్న నిరుద్యోగ యువతకు మంచిర్యాల పట్టణంలోని వెంకటేశ్వర్లు థియేటర్ చౌరస్తా వద్ద ఉన్న టీటీడీ మండపంలో ఆగస్టు 20న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి రోజు నుండి కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణ తరగతులు పుస్తకాలు,ఉదయం అల్పాహారం,మధ్యాహ్న భోజనం సదుపాయం కల్పిస్తానని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు.సోమవారం మంచిర్యాల ఎమ్మెల్యే నివాసంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంచిర్యాల శాసనసభ్యులు,మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ లు మాట్లాడారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై నెలలో నిరుద్యోగులకు శుభవార్త తెలుపుతు7,437పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ లను విడుదల చేసిన సందర్భంగా ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.మంచిర్యాల జిల్లాకు చెందిన యువత పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ కోసం రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నాగార్జున స్కానర్ రూపంలో ఈనెల 16వరకు ఫామ్ పూర్తి చేసుకోవాలని సూచించారు.2నెలల పాటు ఈ శిక్షణ కొనసాగుతుందని తెలిపారు.అదేవిధంగా మంచిర్యాల కాలేజీ రోడ్డులోని పాత వ్యవసాయ మార్కెట్ యాడ్ లో మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టిఫిన్,మధ్యాహ్న భోజనం అందించేందుకు హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ పనులను వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు.విద్యార్థుల కోసం ఇంత మంచి కార్యక్రమం మంచిర్యాల నియోజకవర్గానికి ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.‌తొలుత టిఫిన్ పంపించడం జరుగుతుందని,ఆ తర్వాత దసరా వరకు మధ్యాహ్న భోజనం పంపిణీ ఉంటుందన్నారు.దసరా తర్వాత చెన్నూర్ లో అమలు చేస్తారని చెప్పారు.ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు మినహా పాఠశాల,జూనియర్ కాలేజ్ విద్యార్థులకు ఈ భోజనం,టిఫిన్ పథకం వర్తిస్తుందని తెలిపారు.కాంగ్రెస్ కార్పొరేటర్ లు తనను విడిచి వెళ్తారని ప్రచారంలో వాస్తవం లేదని ఎమ్మెల్యే అన్నారు.పార్టీలో  విభేదాలు ఉన్నట్లు ప్రజల్లో అపోహ సృష్టించాలనుకునే 
బిఆర్ఎస్,బీజేపీ నాయకులకు ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు.మంగళవారం నుండి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు తాగునీరు సరఫరా జరగనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఈ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ,మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్,డిప్యూటీ మేయర్ సల్ల రమ్య,మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి,మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పెంట రజిత,పట్టణ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గజ్జల హేమలత,కార్పొరేటర్లు,యువజన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..

Tags:

About The Author

Latest News