సిద్దిపేటలో ‘కేసీఆర్ ఉచిత శిక్షణా శిబిరం’..

నిరుద్యోగ యువతకు ఉచిత కానిస్టేబుల్ కోచింగ్

Published On
సిద్దిపేటలో ‘కేసీఆర్ ఉచిత శిక్షణా శిబిరం’..

సిద్దిపేట ఆగస్ట్ 10(లోకల్ గైడ్):

పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆధ్వర్యంలో ‘కేసీఆర్ ఉచిత శిక్షణా శిబిరం’ ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు పాల సాయిరాం, ఎడ్ల సోమిరెడ్డి తెలిపారు.సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువతకు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ఉచిత కానిస్టేబుల్ కోచింగ్ అందించనున్నట్లు చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో ఫీజులు చెల్లించలేని విద్యార్థులకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.గతంలో నిర్వహించిన కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్ల ద్వారా ఎంతోమంది కానిస్టేబుల్, గ్రూప్స్, ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడ్డారని వారు గుర్తు చేశారు. ప్రస్తుతం పోలీస్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల కావడంతో యువతకు అవసరమైన శిక్షణ అందించేందుకు ఈ ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.త్వరలో దరఖాస్తులు స్వీకరించి, అర్హత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పారు. సిద్దిపేట నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.నిరుద్యోగులు, విద్యార్థులు ఉద్యోగాల కోసం ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించిన తర్వాతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సోయి వచ్చిందని, అందుకే కొంతమేరైనా పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలs చేశారని వారు విమర్శించారు.ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు మోహిజ్, పాపయ్య, సిద్దిపేట అర్బన్ మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నరేష్, సర్పంచులు నరేందర్‌రెడ్డి, దేవయ్య, యువజన నాయకులు నరేందర్‌రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News