అదుపు తప్పి బోల్తాపడ్డ ఆటో.. మహిళ మృతి

మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ముప్కాల్ నుంచి మెండోరా వైపు ప్యాసింజర్లతో వస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.

Published On
అదుపు తప్పి బోల్తాపడ్డ ఆటో.. మహిళ మృతి

నిజామాబాదు జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ ), ఆగష్టు 10: 
    అదుపుతప్పిన ఆటో బోల్తా పడగా ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన నిజామాబాదు జిల్లా ముప్కాల్​ నుంచి మెండోరా వెళ్తుండగా చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ముప్కాల్ నుంచి మెండోరా వైపు ప్యాసింజర్లతో వస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న కోడిచర్ల గ్రామానికి చెందిన వేల్పూర్ దేవాయ్ అనే మహిళ ఘటనాస్థలంలోనే మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరికొందరికి గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆటోను ముప్కాల్ గ్రామానికి చెందిన సాయికుమార్ నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు.

Tags:

About The Author

Latest News

ముక్కిసా లచ్చవ్వ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ ముక్కిసా లచ్చవ్వ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్
బెజ్జంకి ఆగస్ట్ 10(లోకల్ గైడ్): బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ముక్కిసా లచ్చవ్వ ఇటీవల మృతి చెందగా, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్...
వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలి: రాందాస్ నాయక్
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.
అదుపు తప్పి బోల్తాపడ్డ ఆటో.. మహిళ మృతి
కార్మిక–రైతు పోరాటానికి డీవైఎఫ్ఐ  మద్దతు
రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణ తరగతులు
సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు