పాలిటెక్నిక్ డిప్లమా విద్యను విలీనం చేయవద్దు.

Published On
పాలిటెక్నిక్ డిప్లమా విద్యను విలీనం చేయవద్దు.

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) 

 

పాలిటెక్నిక్ విద్యను శక్తిలో విలీనం చేయవద్దIMG-20260903-WA0085ని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని,విద్యార్థులు కళాశాల ఆవరణలోనే బైఠాయించి గురువారం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తు డిప్లమో విద్య విలీనం వలన తమ విలువైన డిప్లమా విద్య ప్రమాణాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెంటనే ఉపసంహరించుకోవాలని తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంతవరకు తమ నిరసనలు వివిధ రకాలుగా కొనసాగుతాయని విద్యార్థులు పేర్కొన్నారు.కళాశాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వన్ టౌన్ సిఐ శ్రీనివాసరావు,ఎస్సై రామకృష్ణ, సిబ్బంది ముత్తయ్య,శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

Tags:

About The Author

Latest News