సుల్తానాబాద్‌లో గణేశుడికి మహా నైవేద్యం

 171  నైవేద్యాలు సమర్పించిన భక్తులు

Published On
సుల్తానాబాద్‌లో గణేశుడికి మహా నైవేద్యం

 

 

పెద్దపల్లి జిల్లా సెప్టెంబర్ 20 (లోకల్ గైడ్)
ఆది దేవుడైన గణేశుడికి భక్తులు మహా నైవేద్యం సమర్పించారు, 171 రకాల నైవేద్యాలను సమర్పించి భక్తిని చాటుకున్నారు, ఆదివారం  పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌  పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య భవన్ లో గణేశుడి వద్ద  జరిగిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన వివిధ రకాల ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య భవన్ భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. గణేషుడు వద్ద ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్ లక్ష్మి , కొమురవెల్లి అక్షిత హరీష్ దంపతులు పూజలో పాల్గొనగా  అర్చకులు పారువెల్ల అభిషేక్ శర్మ దంపతులచే పూజలు చేయించారు, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, ఆర్యవైశ్య సంఘం నాయకులు,  భక్తులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఎన్కతల లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఎన్కతల లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
    మోమిన్‌పేట్, సెప్టెంబర్ 01 ( లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా బ్యూరో : మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో అర్హులైన పేదలందరికీ త్వరలోనే స్మార్ట్ రేషన్
ఫోన్ మోజులో వైద్యుల నిర్లక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పసిపాపల ప్రాణాలతో చెలగాటం
ఆమనగల్లు అభివృద్ధి కోసం ఆచారి ఆమరణ నిరాహార దీక్ష
విద్యార్థులకు సరిపడా బస్సు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు
ఫతుల్లాగూడ జంతు సంరక్షణ కేంద్రంలో కమిషనర్‌ పరిశీలన ఏబీసీ, యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలపై సమీక్ష
దళితుల,అభ్యున్నతి,సామాజిక రాజకీయ ,చైతన్యం కాంగ్రెస్ తోనే సాధ్యం.... షాద్ నగర్ నియోజక వర్గంలో ఎస్సీ, ఎస్టీలకు సముచిత స్థానం...
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన