- District News
- _భక్తిశ్రద్ధలతో శ్రీ కనకదుర్గమ్మ మహంకాళి అమ్మవారికి మహా నైవేద్యం
_భక్తిశ్రద్ధలతో శ్రీ కనకదుర్గమ్మ మహంకాళి అమ్మవారికి మహా నైవేద్యం
_హైదరాబాద్ కలెక్టరేట్‌లో వైభవంగా బోనాల వేడుకలు.. పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల
కుత్బుల్లాపూర్ ఆగస్టు 12 (లోకల్ గైడ్ ప్రతినిధి)
లకిడీకాపూల్‌లోని కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో కొలువుదీరిన శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ మహంకాళి అమ్మవారి సన్నిధిలో మహా నైవేద్యం కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా ఎంప్లాయిస్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ ప్రియాంక అల స్వయంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహా నైవేద్యం సమర్పించారు.ఆషాఢ మాస బోనాల పర్వదినాలను పురస్కరించుకుని కలెక్టరేట్ ప్రాంగణంలోని అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అధికారులు, ఉద్యోగులు, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సంప్రదాయబద్ధంగా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి, ప్రత్యేక పూజలునిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.అమ్మవారి కృపతో జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలిఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల మాట్లాడుతూ.. శ్రీ కనకదుర్గమ్మ మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో హైదరాబాద్ జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంసుభిక్షంగాఉండాలని, ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.కలెక్టరేట్‌లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమష్టిగా భక్తిశ్రద్ధలతో బోనాల కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఉద్యోగులందరూ ఐకమత్యంతో ఇటువంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ద్వారా సంప్రదాయాలను కాపాడుకోవడంతో పాటు పరస్పర సోదరభావాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చని తెలిపారు.హైదరాబాద్ జిల్లా ఎంప్లాయిస్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ ఆధ్వర్యంలో మహా నైవేద్యానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని పూలతో అలంకరించడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేశారు. అధికారులు, ఉద్యోగులు కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.తెలంగాణ తహసీల్దార్ల సంఘం, ట్రెజరీ అండ్ అకౌంట్స్ విభాగానికి చెందిన ట్రెజా యూనియన్, పాత వీఆర్వోల సంఘం, క్లాస్-4 ఉద్యోగుల సంఘం తదితర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రెవెన్యూ శాఖకు చెందిన వివిధ స్థాయిల అధికారులు, సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో హాజరై మహా నైవేద్య కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఉన్నతాధికారుల హాజరుకార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కదిరవన్ పళని, జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ కె. నారాయణ, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) జి. జితేందర్ రెడ్డి, కలెక్టరేట్ పరిపాలనా అధికారి జి. వెంకట్రామ్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.అలాగే హైదరాబాద్ జిల్లా పరిధిలోని డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ శాఖకు చెందిన ఉద్యోగులు, కలెక్టరేట్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మహా నైవేద్యం సమర్పించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.యూనియన్ కార్యవర్గం ప్రత్యేక చొరవమహా నైవేద్య కార్యక్రమం విజయవంతం కావడంలో హైదరాబాద్ జిల్లా ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు కీలకంగా వ్యవహరించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎ. రమేష్, జాయింట్ సెక్రటరీ బాల తులసీరామ్, ట్రెజరర్ కె. శివకుమార్, ఆర్గనైజర్ దశరథ్‌తో పాటు కార్యవర్గ సభ్యులు ,కమిటీ సభ్యులు రాకేష్, బాలకిషోర్, రుమలత్, విజయ్ కుమార్, ఎస్. దీపిక, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.మహా నైవేద్యం.. అనంతరం అన్నప్రసాద వితరణఅమ్మవారికి సమర్పించిన మహా నైవేద్యం కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అమ్మవారికి సమర్పించిన మహా నైవేద్యాన్ని భక్తిశ్రద్ధలతో స్వీకరించిన అనంతరం అందరూ అన్నప్రసాదాన్ని తీసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ.. కలెక్టరేట్ ప్రాంగణంలోని అమ్మవారి ఆలయంలో ప్రతి ఏడాది భక్తిశ్రద్ధలతో బోనాలు, మహా నైవేద్య కార్యక్రమం చక్కగా నిర్వహించిన హైదరాబాద్ జిల్లా ఎంప్లాయిస్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణకుఅభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఈ మహానైవేద్యకార్యక్రమంఆనవాయితీగాకొనసాగుతోందని తెలిపారు. ఉద్యోగులందరూ ఒకే కుటుంబంలా కలిసి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.సంప్రదాయాలు, ఆధ్యాత్మికతకు ప్రతీకగా బోనాలుతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉందని నిర్వాహకులు రామకృష్ణ పేర్కొన్నారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించడంద్వారాప్రజలంతాసుఖశాంతులతో,ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.కలెక్టరేట్‌లో పనిచేసే వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు సమష్టిగా పాల్గొనడంతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది.అమ్మవారిఆలయంభక్తులతోకిక్కిరిసిపోయింది. పూజల అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని, ప్రసాదాలు స్వీకరించారు.ప్రజల సంక్షేమమే ఆకాంక్షఅమ్మవారి కృపాకటాక్షాలతో హైదరాబాద్ జిల్లా ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు కలగాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అధికారులు, ఉద్యోగులు, రామకృష్ణ ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజల జీవితాల్లో ఆనందం, అభివృద్ధి వెల్లివిరియాలని అమ్మవారిని ప్రార్థించారు.మొత్తంగా హైదరాబాద్ కలెక్టరేట్‌లో జరిగిన శ్రీ కనకదుర్గమ్మ మహంకాళి అమ్మవారి మహా నైవేద్య కార్యక్రమం భక్తి,సంప్రదాయం, ఉద్యోగుల సమష్టి భాగస్వామ్యానికి ప్రతీకగా నిలిచింది. వైభవంగా నిర్వహించిన పూజలు, మహా నైవేద్యం, అనంతరం జరిగిన అన్నప్రసాద వితరణతో కార్యక్రమం ఆధ్యాత్మికశోభనుసంతరించుకుంది.ఈసందర్భంగానిర్వాహకులు హైదరాబాద జిల్లా ఎంప్లాయిస్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ మహా నైవేద్య కార్యక్రమం అత్యంత వైభవితంగా జరపటానికి హాల్ డిపార్ట్మెంట్స్ ఆల్ యూనియన్ సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు
