కాగితాల్లో ఘనం - రోగులకు నరకం! అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం!

ప్రైవేటు దందాకు పేదల ప్రాణాలు బలి! సకల సౌకర్యాలంటూ ప్రజాప్రతినిధుల డొల్ల మాటలు! 

కన్నెత్తి చూడని అధికార యంత్రాంగ
Published On
కాగితాల్లో ఘనం - రోగులకు నరకం!  అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం!

IMG-20260903-WA0240

 

 

లోకల్ గైడ్ : అశ్వారావుపేట 

పేదవాడికి ప్రాణవాయువు కావాల్సిన ప్రభుత్వ వైద్యశాల నేడు శాపంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సామాజిక ఆసుపత్రి రోగుల పట్ల పూర్తి నిర్లక్ష్యానికి సజీవ నిదర్శనంగా దర్శనమిస్తోంది. కాగితాలపై సకల సౌకర్యాలతో మూడు పూలు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతోందని ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రచారాలు కేవలం మాటలకే పరిమితమయ్యాయి. రోగం నయమవుతుందన్న ఆశతో లోపలికి వెళ్లిన పేదలు అక్కడి సిబ్బంది తీరు చూసి భయభ్రాంతులకు గురై వెనుతిరిగే దయనీయ పరిస్థితి దాపురించింది.
​దందాగా మారిన వైద్య సేవలు
ప్రభుత్వ జీతాలు పొందుతూ పేదలకు ఉచితంగా వైద్యం అందించాల్సిన ప్రధాన బాధ్యులే ప్రైవేటు క్లినిక్‌లు, ఆసుపత్రులు వెలగబెట్టి వ్యాపారం చేస్తున్నారు. సర్కారు దవాఖానాకు వచ్చే అమాయక రోగులకు లేని జబ్బులను ఆపాదించి మా ఆసుపత్రికి వస్తే రూ.50 వేలకు బదులు రూ.40 వేలకే వైద్యం చేస్తాం అంటూ బహిరంగంగానే దోపిడీకి తెరతీస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని తమ సొంత దందాలకు రిక్రూట్‌మెంట్ కేంద్రంగా మార్చుకున్న తీరు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆసుపత్రిలో కొందరు నర్సులు పేషంట్ల నుండి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తూ పేద రోగులను పీల్చి విప్పి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
పేరుకే పెద్దాసుపత్రి.. చేసేదంతా ‘రెఫరల్’ దందా!
​సర్వరోగ నివారిణిగా వెలుగొందుతోందని ప్రచారం చేసుకుంటున్న అశ్వారావుపేట ప్రభుత్వ వైద్యశాల సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. రోగి లోపలికి అడుగుపెట్టడమే ఆలస్యం ఇక్కడ సౌకర్యాలు లేవు, పై దవాఖానాకు పొండి అంటూ రెఫరల్ చీటీ రాసి చేతిలో పెట్టడమే ఇక్కడి నిపుణులైన వైద్యుల ప్రధాన విధిగా మారిందన్న విమర్శలు తీవ్రస్థాయిలో వెల్లువెIMG-20260903-WA0243త్తుతున్నాయి. అత్యాధునిక యంత్రాలు, సకల హంగులు సమకూర్చామని ప్రజాప్రతినిధులు ఆకాశానికెత్తుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం చిన్నపాటి చికిత్స అందించేందుకు కూడా చేతులెత్తేస్తూ రోగులను ఇతర ప్రాంతాలకు పరుగులు పెట్టిస్తున్నారు. అత్యవసర స్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చే పేదలను అంబులెన్సుల చుట్టూ తిప్పుతూ నరకం చూపిస్తున్నారు.
పండంటి బిడ్డ పుడితే.. పక్కాగా వసూళ్లు!
మరోవైపు, ప్రభుత్వం ఉచిత కాన్పులంటూ కోట్లు ఖర్చు పెడుతుంటే, ఇక్కడ పనిచేసే కొందరు సిబ్బంది మాత్రం కాసుల కక్కుర్తితో పేదలను పీల్చి పిప్పి చేస్తున్నారు. డెలివరీ కోసం వచ్చే గర్భిణుల బంధువులను ఏదో ఒక కారణం చెప్పి వేధించడం పరిపాటిగా మారింది. ​పండంటి బిడ్డ పుట్టిన వేళ ఆనందంలో ఉన్న పేద కుటుంబాల నుంచి రూ.1,000 నుంచి రూ.3,000 వరకు నిర్లజ్జగా వసూలు చేస్తున్నారు.
​అడిగినంత ముట్టజెప్పకపోతే తల్లీబిడ్డల సంరక్షణను గాలికొదిలేసి ముఖం చాటేస్తున్నారన్న ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నాయి.
​పైసలు ఇస్తేనే మందులు, సపర్యలు లేదంటే నిర్లక్ష్యపు చూపులే శరణ్యమనే రీతిలో గైనిక్ విభాగంలో అక్రమ వసూళ్ల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.
​వంద పడకల స్థాయికి ఎదుగుతోందంటూ ఊదరగొట్టే ముందు, ఉన్న రోగులకు వైద్యం అందించే బాధ్యతను, గైనిక్ వార్డుల్లో జరుగుతున్న పచ్చి దోపిడీని ఎందుకు అరికట్టలేకపోతున్నారని స్థానికులు నిలదీస్తున్నారు. రెఫరల్ కేంద్రంగా మారిన ఈ ఆసుపత్రి తీరుపై, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బందిపై జిల్లా వైద్యాధికారులు ఎప్పుడు కొరడా ఝుళిపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పట్టించుకోని సిబ్బంది మురుగునీటి కుంటల మధ్య రోగులు
ఆసుపత్రి లోపల వైద్యుల నుంచి నర్సుల వరకు కనికరం లేని వైఖరి ప్రదర్శిస్తున్నారు.
​మలేరియా, టైఫాయిడ్ వంటి తీవ్ర జ్వరాలతో బాధపడుతూ కోర్సు ప్రకారం ఉదయం, సాయంత్రం ఇంజక్షన్లు తీసుకోవాల్సిన రోగులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. రాత్రి 9 గంటలకు ఇవ్వాల్సిన మందులను అర్ధరాత్రి 11 గంటలైనా వేయకపోవడంతో పసిపిల్లలు, వృద్ధులు అల్లాడిపోతున్నారు.​డయాలసిస్ యూనిట్, ఆసుపత్రి వార్డుల నుంచి వెలువడే కలుషిత వ్యర్థ నీరు బయటకు వెళ్లే దారి లేక ప్రధాన ప్రాంగణంలోనే నిలిచిపోయింది. దీంతో రోగాలను నయం చేయాల్సిన ఆసుపత్రే కొత్త రోగాల పుట్టగా మారింది.​మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా రూపుదిద్దుకున్న క్యాంటీన్ నిరుపయోగంగా పడి ఉండడంతో రోగులు, వారి సహాయకులకు కనీసం ఆహారం కూడా దొరకని పరిస్థితి. ​బయటి వ్యక్తులు మీడియా ముసుగులో ఆసుపత్రిలో పెత్తనం చలాయిస్తూ, లోపాలను కప్పిపుచ్చుతూ అధికారుల కంటే ఎక్కువజోక్యం చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
​కలెక్టర్ ఆదేశాలూ బేఖాతరు.. ఇక ఉద్యమమే శరణ్యం
చుట్టుపక్కల గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం త్వరలోనే ఈ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి విస్తరించాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో, క్షేత్రస్థాయిలో ఉన్న ఈ అధ్వాన పరిస్థితులు వ్యవస్థకే మచ్చ తెస్తున్నాయి. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేసి హెచ్చరించినా స్థానిక యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.  ప్రజాప్రతినిధులు సమావేశాల పేరుతో కాలయాపన చేయకుండా క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా తక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. ​ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, వైద్యారోగ్య శాఖ రంగంలోకి దిగి ప్రైవేటు దందాలు నడుపుతున్న ప్రధాన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పూర్తిస్థాయి విచారణ జరిపి సేవలను మెరుగుపరచకపోతే ప్రాథమిక ఆరోగ్య హక్కు కోసం ప్రజా ఉద్యమానికి దిగుతామని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు.

Tags:

About The Author

Latest News

ఆధ్యాత్మిక భావంతో  అట్టహాసంగా యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవం నిర్వహణ ఆధ్యాత్మిక భావంతో అట్టహాసంగా యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవం నిర్వహణ
---------------------------------------పెద్దపల్లి,  సెప్టెంబర్-17:(లోకల్ గైడ్ )----------------------------------------సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకలో  ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు,...
ఘనంగా ప్రజా పాలన దినోత్సవం.
విఠాయిపల్లి యూటర్న్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
టేకులపల్లి ప్రభుత్వ పాఠశాలలో విషపూరిత నాగుపాము  ప్రత్యక్షం.
విమోచన పోరాట యోధులకు గుడిపూడి తిరుమల రావు జోహార్లు
వీధి వీధిలో విజ్ఞేశ్వరునికి ప్రత్యేక పూజల సందడి
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న జాలిగం రాకేష్