_బోనమెత్తిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్, డాక్టర్ ప్రియాంక అలా

_హైదరాబాద్ జిల్లా ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు వరకల సత్యనారాయణ,                

_వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ బోనాల సంబరాలు
Published On
_బోనమెత్తిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్, డాక్టర్ ప్రియాంక అలా

 

       

 

హైదరాబాద్ లకిడికాపూల్‌లోని కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో కొలువుదీరిన శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు మంగళవారం భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ ప్రియాంక అలా స్వయంగా బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగలో కలెక్టర్ పాల్గొని బోనం సమర్పించడంతో కార్యక్రమానికి మరింత ప్రత్యేకత చేకూరింది.హైదరాబాద్ జిల్లా ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు వరకల సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ ఆధ్వర్యంలోబోనాలవేడుకలనుఘనంగానిర్వహించారు. రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు, ఉద్యోగులు, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉదయం 6.30 గంటలకు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించగా, అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు బోనాలు, తొట్టెల ఊరేగింపు వైభవంగా చేపట్టారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలు ఎత్తుకుని పాల్గొనగా, భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రియాంక అలా బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించి ప్రత్యేకపూజలునిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో హైదరాబాద్ జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆమె ఆకాంక్షించినట్లు నిర్వాహకులు తెలిపారు.అధికారుల హాజరు
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కధిరవన్ పళని, జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ కె. నారాయణ, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) జి. జితేందర్ రెడ్డి, కలెక్టరేట్ పరిపాలనా అధికారి జి. వెంకట్రామ్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. అలాగే హైదరాబాద్ జిల్లా పరిధిలోని డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ శాఖ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఉద్యోగ సంఘాల సమష్టి భాగస్వామ్యంతెలంగాణ తహసీల్దార్ల సంఘం, ట్రైజా యూనియన్, పాత వీఆర్వోల సంఘం, క్లాస్-4 ఉద్యోగుల సంఘం తదితర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఒకే వేదికపై చేరి అమ్మవారి బోనాల ఉత్సవాలను నిర్వహించడం ఉద్యోగుల ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.వరకల సత్యనారాయణ, రామకృష్ణ ఆధ్వర్యంలో ఘన ఏర్పాట్లుహైదరాబాద్ జిల్లా ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు వరకల సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రధాన కార్యదర్శి ఎ. రమేష్, జాయింట్ సెక్రటరీ బాల తులసీరామ్, ట్రెజరర్ కె. శివకుమార్, ఆర్గనైజర్ దశరథ్తో పాటు యూనియన్ కార్యవర్గ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
కమిటీ సభ్యులు రాకేష్, బాలకిషోర్, రుమలత్, విజయ్ కుమార్, ఎస్. దీపిక తదితరులు కార్యక్రమనిర్వహణలో భాగస్వాములయ్యారు. బోనాల ఊరేగింపు, పూజా కార్యక్రమాలు, అన్నప్రసాద పంపిణీ సజావుగా జరిగేలా నిర్వాహకులు చర్యలు చేపట్టారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను అధికారులు,ఉద్యోగులుకలిసిభక్తిశ్రద్ధలతోనిర్వహించడం ఆనందాన్ని కలిగించిందని నిర్వాహకులుతెలిపారు. అమ్మవారి కృపతో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.

Tags:

About The Author

Latest News