- District News
- కట్ట మైసమ్మ కృపతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి.
కట్ట మైసమ్మ కృపతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి.
తాండూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్.
లోకల్ గైడ్/తాండూర్:
కట్ట మైసమ్మ కృపతో తాండూర్ నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని తాండూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వర్త్య విట్టల్ నాయక్ ఆకాంక్షించారు. బుధవారం అమావాస్య సందర్భంగా తాండూర్ ఆదర్శనగర్ (పాత కుంట) కట్ట మైసమ్మ ఆలయంలో ఆలంపల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విట్టల్ నాయక్ మాట్లాడుతూ... ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పడి, పాడిపంటలు వృద్ధి చెందాలని, అందుకు కట్ట మైసమ్మ అమ్మవారి కృపా కటాక్షాలు తాండూర్ నియోజకవర్గ ప్రజలపై ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని.. అమ్మవారి దీవెనలు మెండుగా ఉండాలని మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
