హామీలు అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి పోస్టు ఊడక తప్పదు,

ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హెచ్చరిక

Published On
హామీలు అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి పోస్టు ఊడక తప్పదు,


 

లోకల్ గైడ్ /సంగారెడ్డి :

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్IMG-20260905-WA0428 ప్రకటించాలని, యూత్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనకు నిరసనగా నాలుగో రోజు సంగారెడ్డిలో విద్యార్థి–యువజన నిరసన ర్యాలీ నిర్వహించారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో నిరసన ప్రదర్శన నిర్వహించి … అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పూలమాల వేశారు .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో యువత, విద్యార్థులు, నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు.
“వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వెయ్యి రోజులు పూర్తవుతున్నాయి. అయినా ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య పరిష్కారం కాలేదు, జాబ్ క్యాలెండర్ అమలు కాలేదు, యూత్ డిక్లరేషన్ హామీలు నెరవేరలేదు. యువతకు ఇచ్చిన మాట ఏమైంది? నిరుద్యోగులకు చూపించిన ఆశలు ఏమయ్యాయి?” అంటూ ప్రశ్నించారు.
అధికారం కోసం అవగాహన లేకుండా ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయకుండా యువత, విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతోందని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవాలని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. “రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాషను చూసి విద్యార్థులు, యువత కూడా అదే స్థాయిలో ప్రశ్నిస్తున్నారు. యువతను తక్కువ అంచనా వేయొద్దు” అని అన్నారు.
దేశవ్యాప్తంగా యువత తమ హక్కుల కోసం పోరాడిన సందర్భాలను గుర్తుచేస్తూ, ప్రజాస్వామ్య గొంతును అణచివేయాలని ప్రయత్నించినా యువత ఉద్యమాలు ఆగవని స్పష్టం చేశారు.“హామీలు అమలు చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ పోరాటం మరింత ఉధృతం అవుతుంది. యువత, విద్యార్థుల పక్షాన చివరి వరకు నిలబడతాం అని ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం అని ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలి, యూత్ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలి. లేకపోతే ప్రజా ఉద్యమం తీవ్రతరం అవుతుంది” అని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హెచ్చరించారు.
“హామీలు అమలు చేసే వరకు మా పోరాటం ఆగదు… యువతకు న్యాయం జరిగే వరకు మా అడుగులు వెనక్కి పడవు” అంటూ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ నిరసన ర్యాలీలో విద్యార్థులు, యువజన నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో చంద్ర గౌడ్, మాజీ డీసీసీబీ వైస్ పట్నం మాణిక్యం, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, హకీం, మాజీ సీడీసీ చైర్మన్ లు కాసాల బుచ్చిరెడ్డి , విజేందర్ రెడ్డి, డాక్టర్ శ్రీహరి, మందుల వరలక్ష్మి , మనోహర్ గౌడ్, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు యువత నాయకులు శ్రవణ్ రెడ్డి, వాజిత్ పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులు పాల్గొన్నారు .

Tags:

About The Author

Latest News

శంషాబాద్ పల్ మాకుల గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. శంషాబాద్ పల్ మాకుల గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.
  శంషాబాద్:సెప్టెంబర్19( లోకల్ గైడ్ ప్రతినిధి) శంషాబాద్ మండల పరిధిలోని పాలమాకుల గ్రామం వద్ద శనివారం ఉదయం 6 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి
డిజిటల్ మనీకి ఛార్జీల సంకెళ్లు!
గణపయ్య సేవలో కాంగ్రెస్ నాయకుడు ఎన్ఆర్ఐ గుడిపూడి తిరుమల రావు సందడి
జన్వాడ ఫార్మ్ హౌస్ భూమి నాదే. 
_షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం..._
ఉప సర్పంచ్  ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం 
జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆసుపత్రి పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.