- District News
- కొమరం భీమ్ కాలనీలో 10లక్షలతో సీసీ రోడ్డు పనులకు నిర్మాణ పనులకు ప్రారంభించారు.సర్పంచ్ భూక్య ప్రవీణ్ న...
కొమరం భీమ్ కాలనీలో 10లక్షలతో సీసీ రోడ్డు పనులకు నిర్మాణ పనులకు ప్రారంభించారు.సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ ఆగస్టు 21 మహబూబాబాద్
ఎన్నికల హామీల. లక్ష్యంగా అభివృద్ధి పనులు.
గ్రామంలో మట్టి రోడ్ల కనబడకుండా సీసీ రోడ్డు నిర్మించడమే మా ద్వేయం.రోడ్లు, తాగునీరు, విద్యుత్.. దశలవారీగా కోరం భీం కాలనీ అభివృద్ధి.
ఇప్పటికే రూ.35 లక్షలతో కాలనీలో అభివృద్ధి పనులు
బయ్యారం మండలం కొత్తపేట-గంధంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కొమరం భీమ్ కాలనీ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్న గ్రామ సర్పంచ్ భూక్యా ప్రవీణ్ నాయక్ ఆధ్వర్యంలో రూ.10 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ భూక్యా ప్రవీణ్ నాయక్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇప్పటికే కొమరం భీమ్ కాలనీలో రూ.5 లక్షల నిధులతో మంచినీటి పైపులైన్లు ఏర్పాటు చేసి, బోరు మోటార్ ఫిట్టింగ్ పనులు పూర్తి చేశామని, ప్రజలకు మెరుగైన విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడంతో పాటు, సుమారు రూ.20 లక్షల నిధులతో వివిధ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు వివరించారు. ప్రస్తుతం మరో రూ.10 లక్షల నిధులతో చర్చి నుంచి పుల్లయ్య ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టామని, దశలవారీగా కొమరం భీమ్ కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో మట్టి రోడ్ల లేకుండా ప్రతి ప్రాంతంలో సీసీ రోడ్లు నిర్మించడమే తమ ద్వేయమని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తూ అవసరమైన నిధులు, సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య పాలకవర్గ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కాలనీలో చేపడుతున్న అభివృద్ధి పనులపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను అమలు చేస్తూ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తున్న సర్పంచ్ భూక్యా ప్రవీణ్ నాయక్ వివిధ పార్టీ నాయకులు, కుల సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు, అభినందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు కారుబోతుల రామ్మూర్తి ఉప సర్పంచ్ రావి వీరభద్రరావు దానిసరి వీరభద్రం ముత్తక్క, వీసం రామ్మూర్తి సాంబశివరావు చల్లా సురేష్ పసుపులేటి సతీష్ రాసమల్ల మహేష్ బోడ సాయి ఈసం స్వరూప పెనుగొండ పుల్లయ్య భూక్య బాలకృష్ణ వడ్డే ఉదయ్ గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 20:45:39
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
