స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ 

Published On
స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతం చేయాలి

 

 


మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)


ఈనెల 15న నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో డిసిపి ఎ భాస్కర్,జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్,జిల్లా అదనపు కలెక్టర్ వి రాములు లతో కలిసి అన్ని శాఖల జిల్లా అధికారులతో స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతు ఈనెల 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లాలోని సమీకృత కార్యాలయాల భవన సముదాయం ఆవరణలో వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేసి వేడుకలను విజయవంతం చేయాలని తెలిపారు.పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గౌరవ వందనం,మంచిర్యాల,నస్పూర్ మండలాల తహసిల్దార్ ల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాట్లు,మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో త్రాగునీరు,పారిశుద్ధ్య నిర్వహణ,జిల్లా పౌర సంబంధాల అధికారి ఆధ్వర్యంలో ముఖ్య అతిధి సందేశం,జిల్లా విద్యాధికారి ఆధ్వర్యంలో జాతీయ గీతాలాపన,సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.అధికారులు,అనధికారులు, ప్రముఖులు,మీడియా ప్రతినిధులు,ప్రశంసా పత్రాల గ్రహీతలు,ప్రజలు కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపారు.ప్రశంసా పత్రాల పంపిణీ,పతాక ఆవిష్కరణ,వేదిక అలంకరణ,పుష్పగుచ్చాలు,వేదిక తయారీ,ప్రోటోకాల్ ప్రకారంగా ప్రముఖుల ఆహ్వానం,నిరంతర విద్యుత్ సరఫరా,అత్యవసర ఏర్పాట్లు,అగ్నిమాపక,వైద్య సేవలు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.అన్ని శాఖల అధికారులు,సిబ్బంది వేడుకలకు తప్పనిసరిగా హాజరు కావాలని,వేడుకలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేసే దిశగా కృషి చేయాలని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మోతీరాం,మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాసరావు,మంచిర్యాల ఎసిపి ప్రకాష్,వివిధ శాఖల జిల్లా అధికారులు,పోలీస్ అధికారులు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News