పోచమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలన....

నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్ట ఏర్పాట్లు...

మంచిర్యాల డిసిపి ఎ భాస్కర్. 
Published On
పోచమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలన....

 

 

 


మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

 

 


బెల్లంపల్లి పట్టణం పరిసర ప్రాంతాలకు చెందిన వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగే పోచమ్మ చెరువు వద్ద చేపట్టిన ఏర్పాట్లను మంచిర్యాల డిసిపి ఎ భాస్కర్,మున్సిపల్ చైర్‌పర్సన్ స్వాతి,సబ్‌ కలెక్టర్ మనోజ్ కుమార్,తహసీల్దార్ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ రమేష్,పోలీస్,తదితర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.వినాయక విగ్రహాలు వచ్చే మార్గం,నిమజ్జనం అనంతరం బయటకు వెళ్లే మార్గం,పరిసర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతు నిమజ్జన శోభాయాత్ర సజావుగా సాగేందుకు శోభాయాత్ర మార్గంలో ఉన్న గుంతలను తాత్కాలికంగా పూడ్చి,వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్,మున్సిపల్ కమిషనర్‌లను ఆదేశించారు.ప్రస్తుతం అవసరమైన తాత్కాలిక ఏర్పాట్లు చేపడుతున్నారని,సబ్‌ కలెక్టర్ కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.నిమజ్జన ప్రాంతంలో తగినంత వెలుతురు ఉండేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని సూచించారు.చెరువులో డ్రెడ్జింగ్ ద్వారా లోతును పెంచడంతో పాటు అవసరమైన ఇతర ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.పోలీస్ శాఖ తరపున 3షిఫ్టుల్లో పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా సుమారు 2వేల8వందల వినాయక విగ్రహాల నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో నిర్వాహకులు,ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.నిమజ్జన చెరువులు,నిమజ్జన పాయింట్ల వద్ద చిన్నపిల్లలు,వృద్ధులు,ఈత రాని వ్యక్తులు నీటి వద్దకు వెళ్లకుండా నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.గూడెం,గోదావరి,చెన్నూర్ టౌన్,బెల్లంపల్లి,తాండూర్ తదితర ప్రాంతాల్లో కూడా నిమజ్జన ఏర్పాట్లు చేపడుతున్నందున భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రధాన నిమజ్జన పాయింట్ల వద్ద మత్స్యశాఖ ఆధ్వర్యంలో గాజు ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.విగ్రహాలను తరలించే సమయంలో విద్యుత్ తీగలు,కేబుల్ వైర్ల ఎత్తును ముందుగానే పరిశీలించి,అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అన్ని నిమజ్జన పాయింట్లను జియో ట్యాగింగ్ చేసి,అధికారులు పగలు,రాత్రి వేళల్లో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.పోలీస్ శాఖ సూచనలు,భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా,శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని డిసిసి కోరారు.డిసిపి వెంట బెల్లంపల్లి టౌన్,రూరల్ సిఐలు కె శ్రీనివాసరావు,సిహెచ్ హనోక్,మున్సిపల్ అధికారులు భుజంగరావు,సునీల్,ప్రవీణ్, తదితరులు ఉన్నారు.

Tags:

About The Author

Latest News

ఎన్కతల లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఎన్కతల లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
    మోమిన్‌పేట్, సెప్టెంబర్ 01 ( లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా బ్యూరో : మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో అర్హులైన పేదలందరికీ త్వరలోనే స్మార్ట్ రేషన్
ఫోన్ మోజులో వైద్యుల నిర్లక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పసిపాపల ప్రాణాలతో చెలగాటం
ఆమనగల్లు అభివృద్ధి కోసం ఆచారి ఆమరణ నిరాహార దీక్ష
విద్యార్థులకు సరిపడా బస్సు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు
ఫతుల్లాగూడ జంతు సంరక్షణ కేంద్రంలో కమిషనర్‌ పరిశీలన ఏబీసీ, యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలపై సమీక్ష
దళితుల,అభ్యున్నతి,సామాజిక రాజకీయ ,చైతన్యం కాంగ్రెస్ తోనే సాధ్యం.... షాద్ నగర్ నియోజక వర్గంలో ఎస్సీ, ఎస్టీలకు సముచిత స్థానం...
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన