- District News
- బోటనీ అధ్యాపకుడి కోసం దరఖాస్తుల ఆహ్వానం.
బోటనీ అధ్యాపకుడి కోసం దరఖాస్తుల ఆహ్వానం.
గంటల ప్రాతిపదికన నియామకం.
నేడు అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
- కళాశాల ప్రిన్సిపాల్ గాయత్రి.
Published On
By Ram Reddy
లోకల్ గైడ్/తాండూర్:
వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోటనీ సబ్జెక్టు బోధించేందుకు గంటల ప్రాతిపదికన అధ్యాపకుడి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గాయత్రి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ....ఈ పోస్టుకు ఎం.ఎస్సీ (బోటనీ), బీఈడీ, టెట్ అర్హతలు కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో పాటు బయోడేటాను ఆగస్టు 31,(సోమవారం)మధ్యాహ్నం 12 గంటలలోపు తెలంగాణ మోడల్ స్కూల్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
అభ్యర్థులకు డెమో నిర్వహించి, అనంతరం అర్హత ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 8106427639 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
Tags:
About The Author
Related Posts
Latest News
31 Aug 2026 09:25:53
ఖమ్మం,ఆగస్టు,30: లోకల్ గైడ్:ఖమ్మం : వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మాజీ...
