- District News
- Warangal
- మిషనరీ చర్చి భూములను పరిరక్షించాలి.
మిషనరీ చర్చి భూములను పరిరక్షించాలి.
అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని సీబీసీ హనుమకొండ కమిటీ డిమాండ్
చర్చి ప్రాంగణం నుంచి అశోక జంక్షన్ వరకు భారీ నిరసన ర్యాలీ*
Published On
By Ram Reddy
(లోకల్ గైడ్ న్యూస్)*:హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు30
మిషనరీ చర్చికి చెందిన భూములను పరిరక్షించాలని, వాటిలో ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సెంటినరీ బాప్టిస్ట్ చర్చి (సీబీసీ ) హనుమకొండ కమిటీ బాధ్యులు డిమాండ్ చేశారు.
ఆదివారం చర్చి ప్రాంగణం నుంచి అశోక జంక్షన్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మిషనరీ చర్చి భూములను వ్యక్తిగత, ఆర్థిక ప్రయోజనాల కోసం వినియోగించరాదని నిరసనకారులు నినాదాలు చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ బాధ్యులు మాట్లాడుతూ, ఏపీ హైకోర్టు పరిధిలో ఉన్న మిషనరీ చర్చి భూముల్లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టరాదని స్పష్టం చేశారు. చర్చి భూములను ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారంటూ మండల శ్రీనివాస్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మిషనరీలు, చర్చి సేవా కార్యక్రమాలకు సంబంధించిన భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పేర్కొన్నారు. చర్చి ఆస్తులపై ఎలాంటి అక్రమ కార్యకలాపాలు, ఆక్రమణలు లేదా నిర్మాణాలు జరగకుండా సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కోరారు.
చర్చి భూముల పరిరక్షణ కోసం అవసరమైతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సీబీసీ హనుమకొండ కమిటీ బాధ్యులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జి.జె. నిరంజన్ బాబు, ప్రెసిడెంట్ టి. క్రీస్టాఫర్ రూబెన్, సెక్రటరీ జి. విజయ్ స్వరూప్, ఉపాధ్యక్షులు విద్యాకర్, టి. మోజెస్ క్రిస్టాఫర్, ట్రెజరర్ బి. విజయ్ కుమార్, జాయింట్ సెక్రటరీలు జె. డానియేలు, జాన్షన్ ప్రసాద్, మత విశ్వాసకులు బోడ డిన్న, డా. పులి అనిల్ కుమార్, పాస్టర్ ఐజాక్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
31 Aug 2026 09:25:53
ఖమ్మం,ఆగస్టు,30: లోకల్ గైడ్:ఖమ్మం : వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మాజీ...
