- District News
- Khammam
- వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం
వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం
ముఖ్యఅతిథి ఖమ్మం నగర మాజీ మేయర్ పూనుకొల్లు నీరజ
ఖమ్మం,ఆగస్టు,30: లోకల్ గైడ్:
ఖమ్మం : వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మాజీ మేయర్ పూనుకొల్లు నీరజ పాల్గొని మాట్లాడారు . ప్రజలలో చాలామందికి నేత్రదానంపై అపోహాలు ఉన్నాయని దీనిపై అవగాహన లేదని సోషల్ మీడియాలో మరియు మీడియా ద్వారా ప్రచారింపజేసి అవగాహన తీసుకురావాలని కోరారు . ఒక దాత ఇద్దరుకు దృష్టిని దానం చేయవచ్చు అని అన్నారు . కళ్ళు మన శరీరంలో అత్యంత విలువైన భాగం కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని తదనంతరం నేత్రదానం చేయాలని సూచించారు . ఈ సందర్భంగా వాసన్ ఐ కేర్ హాస్పిటల్ డాక్టర్ కిషన్ , డాక్టర్ శివరాం , డాక్టర్ సృజన్ మాట్లాడుతూ వయస్సు , లింగ భేదం లేకుండా ఎవరైనా నేత్రదానం చేయవచ్చు . కళ్ళద్దాలు ధరించేవారు , మధుమేహం , అధిక రక్తపోటు మొదలైన సమస్యలతో బాధపడేవారు , కంటిశుక్లం శస్త్రచికిత్స చేయించుకున్నవారు కూడా కళ్ళను దానం చేయవచ్చు . ఎయిడ్స్ (HIV) , రేబిస్ , హెపటైటిస్ బి/సి , సెప్సిస్ లేదా కొన్ని రకాల క్యాన్సర్లు ఉన్నవారు నేత్రదానం చేయడానికి అనర్హులు . మరణించిన తర్వాత 4 నుండి 6 గంటల లోపు కళ్ళను సేకరించాల్సి ఉంటుందని కావున వ్యక్తి మరణించిన వెంటనే స్థానిక ఐ బ్యాంకుకు సమాచారం అందించాలని కోరారు . నేత్రదానం ప్రాముఖ్యత చాలామందికి తెలవదని అన్నారు . కళ్ళు తొలగించడం వల్ల ముఖం వికృతంగా మారదు . లక్షలాది మంది భారతీయులు కార్నియల్ అంధత్వంతో బాధపడుతున్నారు . సేకరించిన కళ్ళు ద్వారా అంధత్వం ఉన్నవారికి అమర్చి వారికి చూపు ప్రసాదించవచ్చు అని పేర్కొన్నారు . నేత్రదానం చేద్దాం .. చూపును పంచుదాం ! అని అవగాహన ర్యాలీ ని జడ్పీ సెంటర్ వరకు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో మేనేజర్ మానుకొండ వీరభద్రం మరియు వాసవి ఐ కేర్ హాస్పిటల్ ఖమ్మం బృందం పాల్గొన్నారు .
