- District News
- Ranga Reddy
- పేదల పెళ్లిళ్లకు గండికొట్టిన రేవంత్ సర్కార్
పేదల పెళ్లిళ్లకు గండికొట్టిన రేవంత్ సర్కార్
నార్సింగి సర్కిల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి
Published On
By Ram Reddy
గండిపేట, ఆగస్టు 17 (లోకల్ గైడ్):
శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి కి మహిళల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. మహిళలకు ఇస్తామన్న రూ.2,500 నగదును ఇప్పటికే మంగళం పాడారని ఎద్దేవా చేశారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పై హైకోర్టు స్టే ఇవ్వడంపై కౌంటర్ ఫైల్ దాఖలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుందని మండిపడ్డారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల అభ్యున్నతికి కెసిఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశంలోని అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచిందని ఆయన తెలిపారు. ముఖ్యంగా పేరేంటి ఆడపడుచులకు షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి సంక్షేమ పథకాలు రూ. 1,16,116 ఆర్థిక సహాయం చేసి అండగా ఆసరాగా నిలిచిందన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి సంక్షేమ పథకాల చెక్కులు నిలిపివేత తో - నిరుపేద కుటుంబాల్లో ఆర్థిక భారం పడుతుందన్నారు. రద్దుచేసి పేదింటి ఆడపడుచుల పొట్ట కొట్టారని నిరసన ఆందోళనల చేపట్టారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ అధ్యక్షుడు ముక్తార్, మాజీ సర్పంచ్ ఉప్పల్ ముత్యాలు, సీనియర్ నాయకులు రవి యాదవ్, వెంకటేష్, రాములు, శాంతి నాయక్, శ్రీనివాస్, జైసింహ, మహిళా అధ్యక్షురాలు నిసా బేగం, మల్లేష్, వార్డు మెంబర్ గణేష్ ముదిరాజ్, గణేష్ రెడ్డి, పెద్దపులి కిషన్, శ్రీకాంత్ రెడ్డి, వాసు, ఫరీదా బేగం, సీమా బేగం, క్షేమమా బేగం, సల్మా బేగం, రజనీకాంత్, అరుణ, రేణుక, కవిత తదితరులు పాల్గొన్నారు.Tags:
About The Author
Related Posts
Latest News
31 Aug 2026 09:25:53
ఖమ్మం,ఆగస్టు,30: లోకల్ గైడ్:ఖమ్మం : వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మాజీ...
