రైతుల పక్షాన కాంగ్రెస్‌.. ప్రతిపక్షాలవి మొసలి కన్నీళ్లు

వైరా రైతులకు ప్రతి ఎకరాకు సాగునీరు అందించే బాధ్యత ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌దే

గోదావరి జలాలతో వైరా రిజర్వాయర్‌కు శాశ్వత నీటి భరోసా — రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దాసరి దానియేలు
Published On
రైతుల పక్షాన కాంగ్రెస్‌.. ప్రతిపక్షాలవి మొసలి కన్నీళ్లు

 






వైరా, ఆగస్టు 17 (లోకల్ గైడ్ ) :

కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలిచే రైతు పక్షపాత పార్టీ అని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దాసరి దానియేలు అన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల విమర్శలను తీవ్రంగా ఖండించారు. రైతుల సమస్యలపై రాజకీయాలు చేయకుండా వాస్తవాలను ప్రజలకు వివరించాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు.
గత పాలనలో రైతులు సాగునీటి కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని, ఆ రోజులను రైతులు ఇప్పటికీ మర్చిపోలేదని దాసరి దానియేలు అన్నారు. ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరు కార్చినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు రూ.65 కోట్లతో కాలువలకు ఇరువైపుల సైడ్ వాల్స్ నిర్మించి పూడికతీత పనులు చేపట్టారని తెలిపారు. ప్రస్తుతం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రూ.45 కోట్లతో కుడి, ఎడమ కాలువల అభివృద్ధి, సుందరీకరణ పనులకు చర్యలు చేపట్టారని వివరించారు. రైతుల కోసం గత పాలకులు ఏం చేశారో ప్రజలు గమనించాలని అన్నారు.

గోదావరి జలాలతో వైరాకు నీటి భరోసా

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వైరా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని దానియేలు తెలిపారు. ముఖ్యంగా గోదావరి జలాలను రాజీవ్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్‌కు అనుసంధానం చేసి, వైరా రిజర్వాయర్‌ను బ్యాలెన్స్ రిజర్వాయర్‌గా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. దీని ద్వారా భవిష్యత్తులో సాగునీరు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు.
దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని అనేక ప్రాంతాల్లో నీటి సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో సాగు, తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడుతోందన్నారు.
కొన్ని రోజుల పాటు నీటి విడుదలను నియంత్రించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పటికీ, వైరా నియోజకవర్గ రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి రైతులకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టారని పేర్కొన్నారు.

ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం

వైరా నియోజకవర్గంలో ఏ ఒక్క రైతుకూ సాగునీటి విషయంలో అన్యాయం జరగదని దాసరి దానియేలు స్పష్టం చేశారు. ప్రతి రైతుకు, ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పూర్తి బాధ్యత తీసుకున్నారని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పంటలు సమృద్ధిగా పండేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
గత పాలనలో సాగునీటి కోసం రైతులు ప్రతి సంవత్సరం ఆందోళనలు చేయాల్సి వచ్చేదని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు లేకుండా ముందస్తు ప్రణాళికతో సాగునీరు అందిస్తున్నామని అన్నారు. రైతుల సమస్యలను ప్రతిపక్షాలు రాజకీయ అంశంగా కాకుండా రైతుల ప్రయోజనాల కోణంలో చూడాలని సూచించారు.
వైరా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్‌ను, ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ప్రతిపక్ష పార్టీలకు లేదని దాసరి దానియేలు అన్నారు. రైతుల సంక్షేమం, సాగునీటి భద్రతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ళ గంగారావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం చంద్రశేఖర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వీరంశెట్టి సీతారాములు, జిల్లా జనరల్ సెక్రెటరీ, మాజీ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దొడ్డ పుల్లయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బిడికి రత్నం, మండల కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీటీసీ మచ్చ వెంకటేశ్వరరావు (బుజ్జి), సర్పంచులు మేడూరి రామారావు, పడకమళ్ళ నాగార్జున, కారుమంచి యేసు, వెంకటేశ్వరరావు, మంచాల జయరాజు, షేక్ సైదా, అహ్మద్ పాషా, జి. రామకృష్ణ, శీలం మాధవరెడ్డి, కే. దావీదు, నరసింహారావు, ఎం. వెంకట సాయి, కే. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం
ఖమ్మం,ఆగస్టు,30: లోకల్ గైడ్:ఖమ్మం : వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మాజీ...
తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ హాస్పిటల్లో నర్స్ దారుణ హత్య. 
మణికొండలో వాక్ విత్ హైడ్రా ర్యాలీ 
మిషనరీ చర్చి భూములను పరిరక్షించాలి.
శిరీష మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి
బోటనీ అధ్యాపకుడి కోసం దరఖాస్తుల ఆహ్వానం.
ప్రజలతో మమేకమైన పోలీసింగ్