మహేశ్వరం ఆగస్టు 30, ( లోకల్ గైడ్ ): తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఓ నర్స్ అనుమానస్పదస్థితిలో దారుణ హత్యకు గురైంది. ఈ మర్డర్ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనను తెలుసుకొన్న శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఈ దారుణాననికి గల పరిస్థితిని హాస్పిటల్ సిబ్బంది, పహాడి షరీఫ్ పోలీసులను అడిగి తెలుసుకొన్నారు. డీసీపీ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం... భద్రాద్రి జిల్లా కొత్తగూడెంకు చెందిన శిరీష పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడలో గల ప్రైమ్ కేర్ హాస్పిటల్ లో నర్స్ గా విధులు నిర్వహిస్తుంది. అయితే ఆమె అదే హాస్పిటల్ లోని క్వార్టర్లో నివసిస్తుండగా ఆదివారం ఓ గదిలో విఘతజీవిగా పడిఉంది. ఆమె ఉన్న గది తలుపులు వేసి ఉండటంతో అక్కడి సిబ్బంది అనుమానంతో తోటి సిబ్బందికి చెప్పి చూడగా ఆపస్మరక స్థితిలో పడి ఉంది. ఈ విషయాన్ని హాస్పిటల్ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారంతో పహాడీ షరీఫ్ పోలీసులతోపాటు శంషాబాద్ డిసిపి రాజేష్ ఏసిపి శ్రీకాంత్ గౌడ్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. శిరీషను ఎవరో హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని తెలిపారు. సంఘటన స్థలంలో క్లూస్ టీం ఫింగర్ ప్రింట్స్ టీం లను రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నామని అయన తెలిపారు. ఈ హత్యకు సంబందించిన అన్ని ఆధారాలు సేకరించిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని డిసిపి రాజేష్ తెలిపారు. ప్రస్తుతం ఘటన స్థలంలో దర్యాప్తు కొనసాగుతుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.