2వ వార్డులో సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం.

Published On
2వ వార్డులో సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం.

 


మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)


బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో 10లక్షల ఎమ్మెల్యే గ్రాంటు సిఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి ఆదివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు వార్డు కౌన్సిలర్ గా గెలుపొందిన నిచ్చకోల వంశీకృష్ణ నిత్యం వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తుండడం అభినందనీయమని అన్నారు.వార్డులో సీసీ రోడ్ల నిర్మాణం,సల్లేజ్ డ్రైన్ లు,మురికి కాలువలు,వీధిలైట్లు ఏర్పాటు కోసం ప్రతినిత్యం తమతో పాటు అధికారులను సైతం నిధులు మంజూరు చేయాలంటు ప్రతీరోజు కోరుతుంటారని ఆమె పేర్కొన్నారు.వార్డు అభివృద్ధి కోసం నిత్యం కృషి చేస్తున్న ఆయన సేవలు అభినందనీయమని అన్నారు.ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో 2వ వార్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఆమె తెలిపారు.అనంతరం కౌన్సిలర్ ఆహ్వానం మేరకు వార్డులో నెలకొల్పిన గణనాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు ఇప్ప కుమార్,పోలు ఉమాదేవి,కొక్కుల రామ్మూర్తి,రాయమల్లు,నాయకులు దావ రమేష్,శంకర్ సింగ్,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News