- District News
- _131 డివిజన్‌లో ఘనంగా బోనాల వేడుకలు.. అమ్మవారి ఆశీస్సులు పొందిన జాలిగం రాకేష్
_131 డివిజన్‌లో ఘనంగా బోనాల వేడుకలు.. అమ్మవారి ఆశీస్సులు పొందిన జాలిగం రాకేష్
_తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు
కుత్బుల్లాపూర్, ఆగస్టు 09 (లోకల్ గైడ్ ప్రతినిధి):
ఆషాఢ మాస బోనాల పండుగను పురస్కరించుకొని 131వ డివిజన్‌లోని పలు కాలనీల్లో నిర్వహించిన బోనాల వేడుకల్లో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు జాలిగం రాకేష్ పాల్గొన్నారు. ఆయా కాలనీల కమిటీలు, నిర్వాహకుల ఆహ్వానం మేరకు పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అమ్మవారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్రజల యోగక్షేమాలను ఆకాంక్షించారు.బోనాల పండుగ సందర్భంగా 131వ డివిజన్‌లోని తనను ఆహ్వానించిన ప్రతి కాలనీకి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని జాలిగం రాకేష్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తూ,సాంప్రదాయబద్ధంగా బోనాలను సమర్పించడం తెలంగాణ సంస్కృతిలో తరతరాలుగా కొనసాగుతున్న గొప్ప ఆచారమని అన్నారు.ఈ సందర్భంగా జాలిగం రాకేష్ మాట్లాడుతూ.. అమ్మవారి కృపాకటాక్షాలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, ఆనందంతో, అభివృద్ధితో ముందుకు సాగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.బోనాల పండుగ ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని మరింత పెంపొందిస్తుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరి కుటుంబంపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.131వ డివిజన్‌లో బోనాల వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ఆలయ కమిటీలు, కాలనీ సంక్షేమ సంఘాలు, నిర్వాహకులు, మహిళలు, యువతను ఈ సందర్భంగా జాలిగం రాకేష్ అభినందించారు. బోనాల పండుగను ప్రశాంత వాతావరణంలో, సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు, మహిళలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
